Temple : మాంసం నైవేద్యంగా పెట్టే దేవాలయం ఏదో తెలుసా..?

Temple : సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం ఎన్నో ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. దేవాలయాలకు వెళ్లేటప్పుడు కానీ ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు నిర్వహించే టప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం ముట్టుకోకూడదు అని ఆచారాలు చెబుతున్నాయి. ఇక అలాగే మన పెద్దలు కూడా ఈ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు. ఇక ఏ దేవాలయంలో అయినా సరే దేవుడికి నైవేద్యంగా కేవలం తీపి పదార్థాలను మాత్రమే అర్పించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అక్కడ దేవాలయాల్లో మద్యం, మాంసం నైవేద్యంగా సమర్పించడం మీరు ఎప్పుడైనా విన్నారా..? వినడానికి విడ్డూరంగా అనిపించినా.. వారణాసి లో ఉన్న బాబా బాతుక్ భైరవ ఆలయం లో గుడికి నైవేద్యంగా మాంసాన్ని సమర్పిస్తారట .ఈ ఆచారం అక్కడ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.

ఇకపోతే వారణాసి లో ఉన్నబాబా బతుకు భైరవ ఆలయంలో వున్న మహాదేవుడు రజస్వరూపం, తామస రూపం , సాత్విక రూపం అనే మూడు రూపాలలో దర్శనం ఇస్తారు. ఇక ఉదయం స్వామివారిని సాత్విక రూపంలో చిన్నారి స్వామి గా అలంకరించి స్వామి వారికి పిల్లల చేత బిస్కెట్లు, చాక్లెట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయంవేళ సాత్విక రూపంలో ఉన్న చిన్నారి స్వామికి నమస్కరించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి సుఖసంతోషాలతో ఉంటారని అక్కడివారి నమ్మకం . ఇక మధ్యాహ్నం సమయంలో స్వామి వారికి ధరించిన వస్త్రాలను మార్చి రజస్వరూపంలో అలంకరిస్తారు. ఇక ఇలా అలంకరించిన అప్పుడు స్వామికి పప్పు, అన్నం, బ్రెడ్ మొదలైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది.

temple where meat is offered in Bhairava Temple for Baba Batu
temple where meat is offered in Bhairava Temple for Baba Batu

సాయంత్రం వేళల్లో స్వామివారిని తామస రూపంలో అతి భయంకరమైన ఉగ్రరూపంలో స్వామి వారిని అలంకరిస్తారు. ఈ రూపంలో ఉన్న స్వామి వారికి భక్తులు పెద్ద ఎత్తున మటన్ , చికెన్, చేపలు అలాగే వివిధ రకాల మాంసాహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అంతే కాదు మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఎక్కడినుంచో వచ్చిన భక్తులు స్వామివారి మూడు అవతారాలను చూడడానికి రోజంతా అక్కడే వేచి ఉండడం గమనార్హం. ఒకవేళ ఈ ఆర్టికల్ గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అనుకున్నట్లయితే.. ఇక మీతో పాటు మీకు నచ్చిన వారికి ఈ విషయాలను తెలియ చేయాలని మీరు అనుకున్నట్లయితే వెంటనే ఈ ఆర్టికల్ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయగలరు.