Lakshmi Devi : శనివారం రోజు లక్ష్మీదేవికి ఇలా చేస్తే డబ్బే డబ్బు..!!

Lakshmi Devi : ఈ ప్రపంచమే డబ్బుతో ముడిపడి ఉంది .. కాబట్టి డబ్బు పొందాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని అలాగే కష్టపడి పని చేయాలని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లు అయితే ధన ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఇకపోతే ప్రత్యేకంగా శనివారం రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించడంవల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మనిషిగా జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కష్టసుఖాలు తొలగిపోయి.. సుఖసంతోషాలతో కుటుంబంతో కలిసి గడపాలని కోరుకుంటారు. ఇక అదేవిధంగా సుఖశాంతులు , జీవితంలోనే కాదు ఇంట్లో కూడా ఉండాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు.

సంతోషంగా ఉండాలి అంటే డబ్బు కూడా అవసరం అని తెలుసుకోవాలి. ఇక అలాంటప్పుడు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం రోజున ఈ విధంగా చేయాలి అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనకు ధన ప్రాప్తి కలగాలంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడాలి. ప్రతికూల పరిస్థితులు తొలగిపోవాలి అంటే ప్రతి శనివారం ఇంట్లో ఉన్న బూజు దులపాలి. ఇంట్లో విరిగిపోయిన , పగిలిపోయిన వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని శనివారం రోజు మాత్రమే బయటపడే వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

If you do this to Lakshmi Devi on Saturday you will get money
If you do this to Lakshmi Devi on Saturday you will get money

అంతేకాదు ధన ప్రాప్తి కలగాలంటే శుక్రవారం రోజున ఉపవాసం చేస్తూ అమ్మవారి పూజలో ఒక లవంగాన్ని సమర్పించడంవల్ల ధనప్రాప్తి కలుగుతుంది అట. అనుకూల వాతావరణం కలగాలి అంటే ఆ ఇంటి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటతడి పెట్టకూడదు. మీ ఇంటి పూజ గదిలో ఈ ఏకాక్షి కొబ్బరికాయను ఎల్లవేళలా ఉంచడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక పోతే ఇలాంటి ధనప్రాప్తి పొందాలి అని ఎవరైనా అనుకుంటున్నట్లు అయితే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.