Health Benefits : అరచేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు వస్తున్నాయా..?

Health Benefits : చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అరచేతులు, అరికాళ్లలో తిమ్మిర్లు , మంటలు అనేవి రావడం సహజమే. తిమ్మిర్లు వచ్చినప్పుడు ఒక్కోసారి సూదులతో గుచ్చినట్టు, జివ్వుమని లాగినట్టు, తిమ్మిరి వచ్చిన భాగం మన స్వాధీనంలో లేకపోవడం లాంటి సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎక్కువసేపు అలా కదలకుండా కూర్చున్నా కూడా కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం సహజం. ఇక అలా తిమ్మిర్లు వచ్చినప్పుడు నాలుగు అడుగులు వేస్తే తప్ప తిమ్మిర్లు తగ్గిపోవు. ఒకవేళ తిమ్మిర్లను కనుక మీరు అశ్రద్ధ చేసినట్లయితే నరాల మీద అధిక ప్రభావం పడి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఇక డయాబెటిస్ ఉన్న వారిలో అధికంగా నరాలు ఒత్తిడికి గురి అయినప్పుడు రక్తప్రసరణ సరిగా జరగదు.. అలాంటప్పుడు కూడా తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. తిమ్మిర్లు , మంటలు సమస్యలను తొలగించుకోవాలి కంటే కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా మీరు వైద్యుడు చెప్పే సలహాలను పాటిస్తూనే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ముందుగా సొరకాయ ముక్కలను చక్రాల్లా కట్ చేసి.. గాట్లు పెట్టి తిమ్మిర్లు ఉన్న ప్రదేశంలో వీటితో బాగా రుద్దాలి..

Health Benefits How to stop leg cramps sorakaya massage
Health Benefits How to stop leg cramps sorakaya massage

ఇక ఇలా రాత్రి సమయంలో పడుకునే ముందు ఇలా చేస్తే నిద్ర కూడా బాగా పడుతుంది.సోంపు గింజలు, పటిక బెల్లం రెండు సమాన మోతాదులో తీసుకొని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఒక అర టేబుల్ స్పూన్ మోతాదులో ఉదయం పూట తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. అయితే ఒక నెల రోజుల పాటు ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఇక వైద్యుడు సంరక్షణలో మీరు వంటింటి చిట్కాలను ఉపయోగించినట్లయితే ఖర్చు లేకుండా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్య అనేది ఎదురవుతుంది కాబట్టి మీకు తెలిసిన వారందరికీ ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.