వామ్మో.. ఇంట్లో ఈ మొక్కలు పెంచితే ధన నష్టం తప్పదట..!

సాధారణంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల సానుకూల ప్రయోజనాలు ఏర్పడి ఇంట్లో వాతావరణం అంత పాజిటివ్ గా మారిపోతుంది. కానీ మరి కొన్ని రకాల మొక్కలను కనుక మనం తెలిసీ తెలియక పెంచినట్లయితే పూర్తిస్థాయిలో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించి నష్టపోవాల్సి ఉంటుందట. ఇక మీకు చుట్టుపక్కల ఎవరైనా సరే తెలిసీ తెలియక కొన్ని రకాల మొక్కలను పెంచుతూ ఉన్నట్లయితే ముందు జాగ్రత్తగా వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి. ఇక పోతే ఎలాంటి మొక్కలను ఇంట్లో పెంచకూడదు.. వేటి వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు కారే మొక్కలను పెంచకూడదు.. వాస్తు శాస్త్రం ప్రకారం పాలుకారే మొక్కలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచకూడదు. ఉదాహరణకు తెల్లజిల్లేడు చెట్టు ని మినహాయించి మిగతా పాలు ఉత్పత్తి చేసే మొక్కలను ఇంట్లో పెంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా పాల ఉత్పత్తి చేసే మొక్కలను ఇంటిలో పెంచడం వల్ల దురదృష్టాన్ని తీసుకు వస్తాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

except for the loss of money if you grow these plants at home
except for the loss of money if you grow these plants at home

బోన్సాయ్ మొక్కలు : చాలామంది ఇళ్లల్లో అందం కోసం ఈ మొక్కలను పెంచుకుంటారు. మరికొంత మంది ఇష్టం కారణంగా వీటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలను పెంచడం అస్సలు మంచిది కాదట. బోన్సాయ్ లేదా కృత్రిమంగా పెరిగే మరుగుజ్జు మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల ఆ ఇంటి ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. అంతేకాదు అశుభకరమైనది గా పరిగణించబడుతోంది. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు..పైగా అన్ని నష్టాలను చవిచూడాల్సి ఉంటుందట.

పత్తి మొక్కలు : పత్తి మొక్కలను కూడా ఇంటి ఆవరణలో కూడా పెంచుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కలు ఇంట్లో పెంచడం వల్ల అశుభాలకు కారణం అవుతుందట. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి మొక్కలకు దూరంగా ఉండడమే మంచిది.

అలాగే ముళ్లు కలిగిన మొక్కలను కూడా పెంచకూడదు.