Hair Benefits : బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తుంది ఈ మొక్క..!

Hair Benefits : ముళ్ళ జాతికి చెందిన నేల ములక మొక్క మన చుట్టుపక్కల విరివిగా కనిపిస్తూనే ఉంటుంది.. ఈ చెట్టును కంటకారీ, నేల ములక, నెల వాకుడు, ముళ్ళ వంగ, వాకుడు చెట్టు అన్ని రకరకాలుగా పిలుస్తారు.. ఈ చెట్టు ఆకులకు ముళ్ళు ఉంటాయి.. ఈ చెట్టు పసుపు రంగు కాయలు కాస్తాయి.. బులుగు రంగు పువ్వులు పూస్తాయి.. చాలా మంది ఈ చెట్టును పిచ్చి మొక్కగా భావిస్తారు..ఈ చెట్టు కాయలు ముళ్ళు ఉంటాయి.

ఈ కాయలను జాగ్రత్తగా సేకరించి వాటిని దంచి రసం తీయాలి. ఈ రసానికి తేనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాస్తే పేనుకొరుకుడు సమస్య పోయె అక్కడ మళ్ళీ కొత్తగా వెంట్రుకలు వస్తాయి. బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ఈ మొక్క ఆకులకు ఉంది.. ఈ ఆకులను దంచి దానికి సమాన మోతాదులో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని అన్ని బట్టతల పై రాస్తే బట్టతలపై కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఇలా తరచు చేస్తూంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆకుల రసం తలపై రాసుకుంటే చుండ్రు శాశ్వతంగా తగ్గిపోతుంది.

Health and Hair Benefits Of Nela Mulaka plant
Health and Hair Benefits Of Nela Mulaka plant

జుట్టు రాలడం కూడా తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ చెట్టు కాయలను జాగ్రత్తగా సేకరించి వాటిని దంచి రసం తీసి ఆ రసాన్ని తలనొప్పి ఉన్నచోట రాస్తే త్వరగా తలనొప్పి తరుగుతుంది. పాము కాటు విషానికి ఈ మొక్క వేరును నూరి దానికి నిమ్మరసం కలిపి రాస్తే విషం విరిగిపోతుంది. ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరి వాటిని కంటిపై ఉంచితే కంటి నొప్పి తగ్గిపోతుంది. ఈ పూలు ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడిని తేనె కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక సమస్యలన్నీ తగ్గిపోతాయి.‌