Sugandhi Pala : ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే వేర్లతో సహా తెచ్చుకోండి..!

Sugandhi Pala: సుగంధిపాల మొక్క మానవాళికి ఎంతో ఉపయోగమని పూర్వీకులు చెబుతున్నారు.. సుగంధిపాల వేర్లను పూర్వకాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు.. సుగంధిపాల వేర్లలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.. వీటిని ఏవిధంగా వాడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!

సుగంధిపాల వేర్లను సేకరించి వాటిని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఈ కషాయం ఎరుపు రంగులో మంచి సువాసనను ఉంటుంది. ఈ కషాయాన్ని తాగితే మన శరీరంలో ఉండే వేడిని తగ్గించి శరీరానికి చలువ చేస్తుంది. అధిక వేడితో బాధపడుతున్న వారు ఈ కషాయాన్ని తాగితే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ కషాయం తాగితే ఆకలి కలగని వంటి ఆకలి కలిగేలా చేస్తుంది ఈ కషాయం తాగితే జ్వరాన్ని తగ్గిస్తుంది. శారీరక నొప్పులను నివారిస్తుంది. వీర్య కణాలను పెంచుతుంది.ఈ కషాయాన్ని తాగితే రక్త ప్రవాహంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వాటిని తొలగిస్తుంది.

Advantages Of Sugandhi Pala Roots
Advantages Of Sugandhi Pala Roots

రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రక్తప్రవాహా వేగాన్ని పెంచి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే ఉంటుంది. సుగంధిపాల వేర్ల కషాయాన్ని తాగితే శరీరంలోని విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. మూత్ర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. చదువుకునే పిల్లలు ఈ కషాయాన్ని తాగితే జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మెదడులోని కణాలను ఉత్తేజపరుస్తుంది. నత్తి సమస్యను తగ్గిస్తుంది. మానసిక సమస్యలను దూరం చేస్తుంది. డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. అంతే కాకుండా చర్మ కాంతిని పెంచుతుంది.