pawan kalyan: పవన్ను ఇందుకేనా టార్గెట్ చేస్తున్నది ?

pawan kalyan: ఇపుడీ విషయమే జనాలకు అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎంఎల్ఏల లెక్కప్రకారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసలు తమకు పోటీయే కాదు. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడే తమకు పోటీకాదని జగన్ అండ్ కో పదే పదే చెబుతున్నారు. చంద్రబాబే పోటీకాదన్నపుడు ఇక పవన్ను మాత్రం వైసీపీ పోటీగా ఎందుకు పరిగణిస్తుంది ? నిజమే పరిగణించాల్సిన అవసరమే లేదు. మరి ఇదే నిజమైతే జగన్ అండ్ కో పవన్ను పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

మిత్రపక్షమైన బీజేపీతో మాత్రమే ఉండిపోవాలా ? లేకపోతే తమతో చంద్రబాబును కూడా కలుపుకుని వెళ్ళాలా అనేది పవన్ వ్యక్తిగతం. చంద్రబాబును కూడా మిత్రపక్షంగా కలుపుకుని వెళ్ళాలంటే ప్రస్తుత మిత్రపక్షం బీజేపీ అగ్రనేతలను ఒప్పించాల్సిన బాధ్యత పవన్ ది, సమస్యా పవన్ దే. ఇందులో వైసీపీ వాళ్ళు జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేనే లేదు. అయినా సరే పదే పదే జగన్ అండ్ కో పవన్ను ఎందుకని కవ్విస్తున్నట్లు ?

దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేయాలని వైసీపీ నేతలు పవన్ను చాలెంజ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పద్దతిలో పోటీచేయాలన్నది పవన్ ఇష్టం. ఇంతచిన్న విషయం కూడా బూతద్దంలో చూపించేస్తు పవన్ను రెచ్చగొట్టే పనిచేయటం ఎంతమాత్రం మంచిదికాదు. ఇక్కడ ఒక విషయం వాస్తవం ఏమిటంటే పవన్ను పదే పదే రెచ్చగొడుతున్నారంటేనే జనసేనకు జనాల్లో ఆదరణ పెరుగుతోందని వైసీపీకి అర్ధమైనట్లుంది.

ఉభయగోదావరి జిల్లాల్లో ఆధరణ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి స్పష్టమైన ప్రాతిపదిక లేదుకానీ ఈమధ్యనే జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో జనసేన కొన్ని స్దానాలను గెలుచుకున్నది. మామూలుగా అయితే జనసేన ఈ స్ధానాలు గెలుస్తుందని కూడా పార్టీలు, జనాలు ఊహించలేదు. అయినా వచ్చిందంటేనే జనాల్లో పార్టీకి ఆధరణ పెరుగుతోందని అనుకోవాలి. ఇదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకత మొదలవ్వటం సహజమే.

అలా ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకతంతా అయితే టీడీపీ లేకపోతే జనసేన ఖాతాలో మాత్రమే పడేందుకు ఎక్కువ అవకాశముంది. ఈ రెండుపార్టీల్లో కూడా జనసేన ఖాతాలో పడేందుకే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జనాలు చంద్రబాబు పరిపాలనను చూసేసున్నారు. చూడంది జనసేన పరిపాలన మాత్రమే కాబట్టి జగన్ వద్దు, చంద్రబాబూ వద్దనుకున్న ఓటర్లు ప్రత్యామ్నాయంగా జనసేనవైపు చూస్తారని వైసీపీ నేతలు గ్రహించారు.


అందుకనే జనాల దృష్టిలో జనసేనను పలుచన చేయటంలో భాగంగానే వైసీపీ నేతలు పదే పదే పవన్ను టార్గెట్ చేస్తున్నారు. మరి జగన్ అండ్ కో ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి ? అనేది పవన్ తీసుకునే నిర్ణయాలపైనే ఉంది. జాగ్రత్తగా పవన్ గనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే జనాలు వెంట నడిచేందుకు రెడీగా ఉంటారు. లేకపోతే కష్టాలు తప్పవు.