Hair Mask : వేసవి కాలంలో చాలా మంది తరచుగా ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి. ఇక జుట్టు రాలడం.. చివర్లు చిట్లిపోవడం.. బలహీనమైన వెంట్రుకలు.. జుట్టు పెరుగుదల లేక పోవడం.. బట్టతల రావడం .. ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేశ సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే జుట్టు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పండ్లతో తయారు చేసిన హెయిర్ మాస్క్ లను ఉపయోగించి చూస్తే ఫలితం మీకే తెలుస్తుంది.
1. అరటి , పెరుగు మాస్క్ : చిట్లిపోయిన , విరిగిపోయిన జుట్టు ను రిపేర్ చేయడంలో హెయిర్ మాస్క్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇకపోతే బట్టతల రావడానికి కూడా కారణం అయినప్పుడు ఈ హెయిర్ మాస్క్ ను చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా పెరుగు , నిమ్మరసం కలపండి. దీనికి అరటిపండు గుజ్జు వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. ఒక 30 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేస్తే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. అలాగే జుట్టు రిపేర్ చేయడం మీరు గమనించవచ్చు.
2. జామ , తేనె మాస్క్ : ఇది జుట్టుకు మంచి హెయిర్ మాస్క్ అని చెప్పవచ్చు.
ముఖ్యంగా జామపండులో విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే శ్లేష్మ పొర పనితీరును కూడా పెంచుతుంది. ముఖ్యంగా బాగా పండిన జామకాయలను తీసుకొని మెత్తగా చేసి అందులో కొంచెం తేనె కలిపి నిమ్మరసం కలపాలి. ఇక దీనిని బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల బట్టతలపై జుట్టు కూడా తిరిగి వస్తుంది. ఇక ఇలాంటి ఆర్టికల్స్ ప్రతి ఒక్కరికి అవసరమే కాబట్టి వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.