ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఉత్తమమైన స్థితికి చేరుకున్న తరువాత ఆశించేది కేవలం సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని.. ఉదాహరణకు ఏ పక్షి అయినా ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి తన గూటికి చేరుకున్నట్టు గానే మనం ఎక్కడికి వెళ్లినా సరే చివరికి సాయంత్రానికి మాత్రం ఇల్లు చేరుకోవాలని..ఇక ఆ ఇళ్లే సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరి కోరిక..కానీ ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్యుడి సొంతింటి కల కలగానే మిగలిపోతోంది. ఇల్లు నిర్మించాలంటే డబ్బు మాత్రమే సరిపోదు.. వాస్తు శాస్త్రం అలాగే కుబేరుడి ఆశీస్సులు కూడా ఉండాలి…ఇక కుబేరుని అనుగ్రహం పొందాలంటే కుబేర యంత్రం సహాయపడుతుంది. మరి ఈ యంత్రం తో ఎలా మన కలను నెరవేర్చుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
లక్ష్మీదేవిని తన గుండెల పై పెట్టుకున్న శ్రీనివాసుడంతటి వాడే తన పెళ్లి కి కావాల్సిన డబ్బును కుబేరునితో అప్పుగా తీసుకున్నాడు.. అంటే కుబేరుడు ఎంత సంపన్నుడో మనం అర్థం చేసుకోవచ్చు . ధనానికి అధిపతి కుబేరుడు అని, అందువల్ల మనం కుబేరుడిని పూజిస్తే త్వరగా ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఇక కుబేరుడు కైలాస పర్వతం లో ఉత్తర దిశ కు.. ఆ పరమేశ్వరుని చేత పాలకుడిగా నియమించబడ్డాడు. అందుకే కుబేరుడు ఉత్తరాదిషుడు అని పురాణాలలో చెప్పబడ్డాడు. ఇక అందుకే కుబేర యంత్రాన్ని పరమేశ్వరుని ఎదురుగా మన పూజ గదిలో ఉత్తరదిశగా పెట్టుకొని పసుపు, పువ్వులు , కుంకుమ అర్చన లతో పూజించి ఏదైనా నైవేద్యం పెట్టి.. గడప దగ్గర ఎవరూ తొక్కని ప్రదేశంలో కుబేరుని ముగ్గు వేసి..
అందులో పసుపు, కుంకుమ వేసి ఒక చిన్న గిన్నెలో నీళ్లు వేసి పుష్పాలను ఉంచవలెను.ఇక ఈ నీళ్లను సాయంత్రం తర్వాత తులసి చెట్టు చివరలో కానీ, ఏదేని మొక్కలలో గాని, ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. ఇలా వారం లో ఒకసారి తమ ఇష్ట దైవాన్ని పూజించేటప్పుడు కుబేర యంత్రాన్ని పూజిస్తే సరిపోతుంది. ఇలా పూజించినా యంత్రాన్ని సొంత ఇంటిని నిర్మించేటప్పుడు ఉత్తరదిశ గోడ కి పెట్టాలి. మనం ధనమును ఏవిధంగా భద్రపరుస్తామో, అదేవిధంగా ఈ కుబేర యంత్రాన్ని కూడా ఉత్తరదిశ గోడలో కనపడకుండా భద్రపరచాలి. ఇలా పూజించడంవల్ల ఇంటిలో కలిగే దుఖాలు,నష్టాలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.