Hair Tips : ఉల్లి తో జుట్టు సమస్యలు అన్నీ పరార్..!!

Hair Tips : సాధారణంగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని చెబుతారు. అందుకే ఆరోగ్యం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది . ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఉల్లిని ఒక భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. జుట్టు తెల్లబడకుండా ఉండడమే కాకుండా జుట్టు రాలే సమస్య ను అలాగే చుండ్రు, జుట్టు చిట్లి పోవడం, విరిగిపోవడం లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇకపోతే జుట్టు సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించి సమస్యలను మరింత క్లిష్టతరం చేసుకుంటున్నారు. కానీ అలాంటి వారు ఎటువంటి కష్టం లేకుండా ఇంట్లో లభించే ఉల్లితో జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు.

ఇకపోతే జుట్టు సమస్యలను దూరం చేసుకోవాలి అంటే కచ్చితంగా ఉల్లి ని మీరు ఉపయోగించాల్సిందే . ఉల్లి తో తయారు చేసే హెయిర్ మాస్క్ కచ్చితంగా ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముందుగా రెండు ఉల్లి గడ్డలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్టులాగా చేయాలి. ఒక పలుచటి గుడ్డ తీసుకొని అందులో ఈ పేస్టు వేసి బాగా పిండితే రసం బయటకు వస్తుంది . ఇక ఈ రసాన్ని బ్రష్ సహాయంతో లేదా చేతితో అయినా సరే జుట్టు కుదుళ్ళకు అప్లై చేయాలి.

Hair Tips with onions will go away 
Hair Tips with onions will go away

ఒక అరగంట ఆగిన తర్వాత గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా మారడమే కాకుండా రక్తప్రసరణ బాగా జరిగి స్కాల్ఫ్ మీద వచ్చే చుండ్రు కూడా దూరం అవుతుంది. జుట్టు తెల్లబడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వయసు పైబడే వారు జుట్టుకు కలర్ లు లాంటివి వేస్తూ ఉంటారు అవి ఎంతో ప్రమాదకరం కాబట్టి అలాంటి వారు ఇలాంటి చిట్కా ను ఖచ్చితంగా పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక ఇలాంటి ఆర్టికల్ ప్రతి ఒక్కరికీ అవసరమే కాబట్టి మీకు తెలిసిన వారికి వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి.