Health Problems : పైనాపిల్ తింటే సమస్యలు తప్పవా.. నిజమేనా..?

Health Problems : ఇటీవల కాలంలో చాలా మంది పైనాపిల్ జ్యూస్ ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో పైనాపిల్ తినడానికి, తాగడానికి ఇష్టం చూపే వారి సంఖ్య ఎక్కువవుతోంది. బరువు తగ్గాలని చూసేవారు అల్పాహారంలో పైనాపిల్ జ్యూస్ కూడా తాగుతున్నారు. ఇకపోతే ఇంకొంతమంది సాయంత్రం స్నాక్స్ రూపంలో పైనాపిల్ తీసుకుంటున్నారు. అయితే పైనాపిల్ ను అధికంగా తీసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి అని.. లేకపోతే అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇందులో దాగి ఉన్న నిజమెంతో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పైనాపిల్ లో అధికంగా విటమిన్ సి లభిస్తుంది. ఇది ఎక్కువగా తీసుకుంటే కడుపునొప్పి, విరేచనాలు, గుండెలో మంట, వాంతులు వంటి సమస్యలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కేవలం వారానికి ఒకసారి మాత్రమే పైనాపిల్ తీసుకుంటే సరిపోతుంది. ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా పైనాపిల్ తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇందులో తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల కొంతమందికి గొంతునొప్పి, జలుబు, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలలో మీరు ఏది గమనించినా.. వెంటనే తినడం మానేయండి.

Except for the problems with eating pineapple
Except for the problems with eating pineapple

ఇందులో ఉండే తీపి పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.ఇకపోతే పైనాపిల్ ఎక్కువగా తీసుకునే వారికి దంత సమస్యలు కూడా అధికంగా వస్తాయి. అంతే కాదు ఇది వరకే ఎవరైనా దంత సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారు పైనాపిల్ తినడం మానేయడం మంచిది. ఇక పైనాపిల్లో తీపి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల సున్నితత్వ సమస్యలను కలిగిస్తుంది. ఇక అతిగా తీసుకుంటే క్యావిటీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వర్కవుట్ లు చేసేవారు పైనాపిల్ జ్యూస్ తాగితే బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వీరు కూడా తక్కువ మోతాదులో తీసుకుంటూ వర్కవుట్ లు చేయడం మంచిది.