Health Benefits : లక్షల సంఖ్యలో కనిపించే ఈ మొక్క గురించి మీకు తెలియని నిజాలు..!

Health Benefits : నీరు ఎక్కడ ఉన్నా ఈ చెట్టు తారసపడ్డతూనే ఉంటుంది.. పొలాల గట్ల పక్కన, చెరువుగట్టు పక్కన, నీటి మడుగు వద్ద, కాలవ దగ్గర మడుగు తామర మొక్క కనిపిస్తుంది.. ఈ చెట్టుని మునుగు తామర, ఆర కూర, మడుగు తామర అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.. ఈ చెట్టు లక్షలసంఖ్యలో గుంపులుగుంపులుగా పెరుగుతూ ఉంటాయి..! ఈ చెట్టు ఆకులలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి..!

మడుగు తామర ఆకులను కోసి కూరగా వండుకోవచ్చు. ఈ ఆకులను చాలా మంది పప్పులు వేసుకుని వండుకుని తింటారు. ఆ కూర చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఈ ఆకుల కూర తీసుకోవడం వలన చక్కటి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఈ ఆకుల కూర అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శారీరక ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.మూర్చ రోగం తో బాధపడుతున్న వారు ఈ ఆకులలో కొద్దిగా పెరుగు కలిపి నూరుకొని సమస్య ఉన్న చోట రాస్తే మూర్ఛ రోగం తగ్గుతుంది.

Excellent Health Benefits of Madugu Tamara Plant
Excellent Health Benefits of Madugu Tamara Plant

ఈ ఆకుల రసం తీసి పాము, తేలు కరిచిన చోట కట్టుకడితే శరీరానికి విషం ఎక్కదు. మడుగు తామర ఆకులలో చిన్న ఉల్లిపాయల రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే గొంతునొప్పి, గొంతు గరగర, కఫం తొలగిపోతుంది. ఈ చెట్టును వేర్లతో సహా తీసుకువచ్చి మెత్తగా నూరుకొని ఆ మిశ్రమాన్ని తలపై రాసి కట్టుకడితే.. ఎంతటి తలనొప్పి అయినా సరే తగ్గుతుంది. మైగ్రేన్ సమస్య నుంచి వెంటనే ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ ఆకుల కూర తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గుతాయి.