Zodiac Signs : ఈ రాశుల వారిపై శని దేవుడు చల్లని చూపులట..ఇక పట్టిందల్లా బంగారమే..!!

Zodiac Signs : హిందూ సాంప్రదాయం ప్రకారం జ్యోతిష్యశాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. మొత్తం తొమ్మిది గ్రహాల్లో నెమ్మదిగా కదిలే గ్రహం శని గ్రహం మాత్రమే. శనిగ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుతూ ఉంటుంది. గత రెండున్నర సంవత్సరాల క్రితం మకర రాశిలో ఉన్న ఈ శని గ్రహం త్వరలో కుంభరాశి లోకి ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 29వ తేదీన కుంభ రాశిలో శని దేవుడు ప్రవేశించానున్నాడు. ఇప్పుడున్న మకర రాశి తో పాటు త్వరలో ప్రవేశించే కుంభరాశి కూడా శని యొక్క సొంత రాశి కావడం గమనార్హం. 30 సంవత్సరాల తర్వాత శని కుంభ రాశి లోకి ప్రవేశించబోతున్నాడు.

నిజానికి శని దేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు.కానీ కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. శని దేవుడు చాలా వరకూ మంచి మాత్రమే చేస్తాడు అని ప్రతీతి. ఇకపోతే ముఖ్యంగా రాశి పరివర్తనం వల్ల ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఇక వారిలో ముఖ్యంగా మేష రాశి వారికి శని గ్రహం శుభవార్తను తీసుకురానుంది. ఆదాయ లాభాలకు సంబంధించి గృహంలో కూర్చుంటారు కాబట్టి మేష రాశి వారికి డబ్బు బాగా వస్తుంది. వృత్తి రంగంలో ఎదగాలని భావించే వారికి ఇదే సరైన సమయం. అలాగే వ్యాపారంలో వృద్ధి.. సమాజంలో గౌరవం రెండూ కూడా పొందుతారు.

God Saturn has a cold look on those of these zodiac signs
God Saturn has a cold look on those of these zodiac signs

వృషభ రాశి వారికి కూడా అదృష్టం కలిసి రానుంది. కోరుకున్న ఉద్యోగం , ప్రమోషన్ తో పాటు మంచి ఇంక్రిమెంట్లు కూడా పొందుతారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. బిజినెస్ చేయాలని ఆసక్తి ఉంటే దానిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.ధనస్సు రాశి వారికి కూడా శని గ్రహం అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఎన్నో బాధలు పడ్డ మీకు ఇకనుంచి అన్ని సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఇలాంటి ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.