Health Benefits : పైసా ఖర్చులేని ఈ ఆకుతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్..!

Health Benefits : ప్రకృతి ప్రసాదం మొక్కలు.. వాటిలో కొన్నింటి ఉపయోగాలే మనందరికీ తెలుసు.. ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుంటే.. వాటి ప్రయోజనాలు పొందడం తేలికే.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో గంగపాయల చెట్టు కూడా ఒకటి.. దీనినే గోళీ కూర, సన్న పాయల, పుల్లపాయల, పెద్ద పావిలి, బొడ్డు పాయల అని రకరకాలుగా పిలుస్తుంటారు..! ఈ ఆకుకూరల్లో ఉండే బోలెడు ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి..!

గంగ పాయల ఆకులో విటమిన్ ఎ, బి, సి, పీచుపదార్థాలు అధికంగా ఉన్నాయి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, పొటాషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఆకులను కూరగా, పప్పుగా, పెసరపప్పు నువ్వులతో కలిపి వండుకుని తినవచ్చు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. రక్త ప్రవాహానికి అడ్డువచ్చే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఇందులో ఉండే మినరల్స్ ఎముకల్ని దృఢంగా ఉంచుతాయి. ఎముకలకు పుష్టి నిస్తాయి.

Health Benefits Of Gangapayala Aaku Plant
Health Benefits Of Gangapayala Aaku Plant

జీర్ణ సంబంధ సమస్యలను తొలగిస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. తరచూ ఈ ఆకులను తీసుకోవడం వల్ల అనేక రకాల సీజన్లలో వచ్చే వ్యాధులను అడ్డుకుంటుంది. ఈ ఆకులలో ఉండే జింక్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. కొత్త కణాలు ఏర్పడకుండా చేస్తుంది. ఈ ఆకులతో వండిన కూర తీసుకుంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.