Health Benefits : పొట్టలో కలిగే ప్రతి సమస్యకి ఇదే సమాధానం..!

Health Benefits : మన వంటింటి దినుసులలో వాము కూడా ఒకటి.. రకరకాల వంటల్లో వామును వినియోగిస్తూ ఉంటాము. వాము వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో వాము కీలక పాత్ర పోషిస్తుంది.. ప్రతిరోజు తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయంటే..వాము గింజలను దంచి పొడి చేసుకోవాలి.

ఒక గ్లాసు మజ్జిగలో ఒక టీ స్పూను వాము పొడిని కలిపి ఉదయం , సాయంత్రం తీసుకుంటే ఊపిరితిత్తులకు గాలి వెళ్లే మార్గం మొత్తం శుభ్రం అవుతుంది. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగవుతుంది . శ్వాస తీసుకోవటంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. ఒక చెంచా వాము తీసుకుని చేతిలో వేసుకుని నలపాలి. అందులో చిటికెడు ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని మొత్తం తినేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగాలి.

Excellent Health Benefits Of Carom Seeds
Excellent Health Benefits Of Carom Seeds

ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి కడుపు నొప్పి అయిన తగ్గిపోతుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.వాము బెల్లం కలిపి ఉసిరికాయంత పరిమాణంలో ఉండగా చేసుకుని తింటే ఆస్తమా తగ్గిపోతుంది. వాము గింజల పొడిలో సమాన మోతాదులో తేనె కలిపి రెండుపూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. గుండె జబ్బులూ రాకుండా చేస్తుంది. వాము బుగ్గన పెట్టుకుంటే కొండ నాలుక వలన వచ్చిన వాపు తగ్గుతుంది.