Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు పొరపాటున ఇలా చేస్తే నష్టం తప్పదు..!!

Akshaya Tritiya : అక్షయ తృతీయ ఈ ఏడాది మే 3వ తేదీన మంగళవారం రోజున వచ్చింది. ఇక ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులను చేయడం వలన లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు అని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి అక్షయ తృతీయ రోజున ఎలాంటి శుభ ముహూర్తాలు చూసుకోకుండానే అన్ని కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఇక ఆ రోజు మంగళవారం అయినా లేదా ఆదివారం అయినా సరే ఏ వారం అయినా శుభ గడియలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ప్రారంభోత్సవాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఏవైనా సరే అక్షయ తృతీయ రోజు ఆలోచించకుండా చేపట్టవచ్చు.

మంగళవారం రోజు అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి కోపానికి గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరైనా సరే పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు కాబట్టి వెంటనే ఆర్టికల్ లో వాట్సాప్ లో ఫేస్బుక్లో షేర్ చేసే సమాచారం అందించండి. ఇక అసలు విషయానికి వస్తే.. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తో సమేతంగా పూజించాలి.. ఇక ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగించాలి.. ముఖ్యంగా తులసి ఆకులను కోసే ముందు పూజ తర్వాత తీసే ముందు శారీరక పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా స్నానం చేయకుండా తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు.అక్షయ తృతీయ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఖాళీ చేతులతో ఇంటికి రావడం మంచిది కాదు. బంగారం లేదా వెండి ని తప్పకుండా తీసుకోవాలి.

If Akshaya Tritiya does this by mistake on the third day it is a loss
 If Akshaya Tritiya does this by mistake on the third day it is a loss

ఒకవేళ స్తోమత లేని వారు మెటల్ తో తయారు చేసిన చిన్న వస్తువులనైనా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇక మరికొంతమంది తెలియకుండానే అక్షయ తృతీయ రోజు కేవలం లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తారు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వలన పుణ్యం లభిస్తుంది.అక్షయ తృతీయ రోజు స్నానం చేయకుండా సంపద ఉన్న స్థలాన్ని శుభ్రం చేయకూడదు . ఇంటి ఖజానాను స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. ఇక ఇంటిని శుభ్రం చేసి సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నూనె లేదా నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే సిరిసంపదలు మీ వెంట ఉంటాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజు ఏ మూలను కూడా చీకటి పడకుండా జాగ్రత్త పడాలి.