బయటకు వెళ్లేటప్పుడు పూర్వ కాలం నుండి పాటిస్తున్న నియమాలు ఇవే..!!

పెద్దలు పూర్వకాలం నుండి కొన్ని నియమ నిబంధనలను పెట్టిన విషయం తెలిసిందే. అయితే వీటిని పాటించం వల్ల కూడా శుభ పరిణామాలు కలుగుతాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తి ని తీసుకోవడం తో పాటు పెద్దలు నేర్పిన కొన్ని విషయాలను కూడా మనం ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాము.. అయితే బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇక పూర్వం నుంచి మన పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆ నియమాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు నీళ్ళు తాగి వెళ్తే మంచిది అని చెబుతారు.

అంతేకాదు వెళ్ళిన పని అవ్వాలి అంటే పెరుగులో పంచదార కలుపుకొని తింటే తప్పకుండా ఆ పని సవ్యంగా సాగుతుంది. మరికొంతమంది ఏదైనా స్వీటు తినమని చెబుతారు. అంతే కాదు వేసుకుని డ్రెస్ నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు ఎదురయ్యే శకునం వరకు ఇలా ప్రతిదీ కూడా సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక ఇప్పటి జనరేషన్ గురించి పక్కన పెడితే అప్పట్లో మాత్రం కొన్ని చిన్నచిన్న పద్ధతులను తప్పకుండా ఫాలో అయ్యేవారు. బయటకు వెళ్ళేటప్పుడు రోజులు వారాలు కూడా అనుసరించేవారు.

Rules from the past when going out
Rules from the past when going out

సోమవారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళితే ఆ పని సక్సెస్ అవుతుందట.

మంగళవారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకొని తింటూ బయటకు వెళ్తే మీరు అనుకొని బయలుదేరిన పని సవ్యంగా సాగుతుందట.

బుధవారం రోజు ధనియాలు నోట్లో వేసుకుని బయటకు అడుగు పెడితే తలపెట్టిన పని పూర్తవుతుంది అని పెద్దలు నమ్మేవారు.

గురువారం రోజు జీలకర్ర వేసుకొని నములుతూ వెళ్తూ ఉన్నట్లయితే అనుకున్న పని నెరవేరుతుంది.

శుక్రవారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార కలుపుకొని తింటే ఎంత కష్టమైన పనే అయినా సరే సులభంగా పూర్తవుతుంది.

నోట్లో వేసుకుని బయటకు వెళ్లడం వల్ల శుభం జరుగుతుందట.

ఆదివారం తమలపాకు లేదా కిళ్ళి వేసుకొని బయటకు వెళ్తే మీరు అనుకున్న విధంగానే పని అయిపోతుందని పెద్దలు చెప్పేవారు. అంతేకాదు వీటన్నింటినీ ఇప్పటికీ కొంతమంది పాటిస్తూనే ఉండడం గమనార్హం.