Flax Seeds : అవిసె గింజలతో రెట్టింపు అందం మీ సొంతం..!!

Flax Seeds : ఆయుర్వేదం ప్రకారం అవిసెగింజలు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి ఔషధంగా పరిగణిస్తారు. ఈ అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు అందం కూడా రెట్టింపు అవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేయడం జరిగింది . కాకపోతే అవిసె గింజల వల్ల చర్మానికి, జుట్టుకు కూడా మంచి జరుగుతుందట. అవిసె గింజల లో మనకు పాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. అవిసె గింజలను ఫేస్ మాస్క్ గా ఉపయోగిస్తే చర్మం శుభ్రంగా మారడంతోపాటు కాంతివంతంగా తయారవుతుంది.

అవిసె గింజల లో ఉండే కొన్ని రకాల పోషకాలు వల్ల చర్మంపై కనిపించే మచ్చలు , ముడతలు, వృద్ధాప్య సంకేతాలు కూడా దూరమవుతాయి. అంతేకాదు ఈ అవిసగింజల తో తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం సహజంగా, బిగుతుగా, యవ్వనంగా మారుతుంది. అవిసె గింజల లో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చర్మం డీహైడ్రేషన్ కాకుండా లోపల తేమ నిలుపుకోవడానికి సహాయపడతాయి. ఫలితంగా చర్మం తాజాగా ఉంటుంది.అవిసె గింజలలో యాంటీ ఆక్సిడెంట్ లు ఉండడం వల్ల చర్మానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ తో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతాయి.

Double the beauty with flax seeds is yours
Double the beauty with flax seeds is yours

ఇక మొటిమలను కూడా దూరం చేస్తాయి. ఈస్ట్రోజన్ స్థాయిని శరీరంలో సమతుల్యం చేయడంలో అవిసె గింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. చర్మంపై సెబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇకపోతే ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అంటే కొన్ని అవిసె గింజలను నీటిలో నానబెట్టాలి. ఈ గింజలను మెత్తటి పేస్టులాగా చేసి.. కొంచెం ముల్తానీ మట్టి కలిపి పేస్టులా తయారు చేయాలి. ఇక ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖంపై ఈవెన్ గా అప్లై చేయాలి. ఇకపోతే ముఖాన్ని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అంతే కాదు మొటిమలు, మచ్చలు కూడా దూరం అవుతాయి..