దేవాలయాల్లో నైవేద్యం సమర్పించేటప్పుడు పరదా ఎందుకు వేస్తారు..?

భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దలు చేసే ప్రతి పని వెనుక ఒక పరమార్థం దాగి ఉంటుంది. అందుకే పాటించే పద్ధతులు ఆచార సంప్రదాయాలు అన్నీ కూడా ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. మనం పెద్దలు చెప్పితే వినమనే భావనతో కొన్ని దేవుడి పేరు చెప్పి కూడా ఆచారాలను పాటించేలా చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. దేవుడు పేరు చెబితే కనీసం భయం తో నైనా సక్రమమార్గంలో నడుస్తారనే భావన మన పెద్ద వాళ్లకు ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కోవడం, దేవాలయాల్లో నైవేద్యంవంటివి జరిగేటప్పుడు కూడా కళ్లార్పకుండా అలాగే చూస్తూనే ఉంటాము.అలా అన్ని విషయాలు మనం చూసినప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించటం అప్పుడు మాత్రం దేవాలయాల్లో పరదా కప్పి వేస్తూ ఉంటారు. అయితే అలా ఎందుకు వేస్తారు.. అలా వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఆలయాలలో అర్చన సమయంలో జరిగే షఓడష ఉపచారాలలో నివేదన కూడా ఒకటి. ఇకపోతే మిగిలిన అన్ని సేవలను కూడా భక్తులు చూసి తరించవచ్చు.

Why is the curtain draped when offering offerings in temples
Why is the curtain draped when offering offerings in temples

కానీ నైవేద్యం నివేదించే టప్పుడు మాత్రం దృష్టిదోషం రాకుండా ఉండాలి అని మన సంప్రదాయం చెబుతోంది. పెద్దవాళ్లు కూడా పిల్లలు భోజనం చేసే సమయాలలో మన ఇళ్లల్లో కూడా ఇలాంటి విధానాలను పాటించడం మనం గమనిస్తూనే ఉంటాం.దేవుడికి నైవేద్యం ప్రసాదంగా పెట్టేటప్పుడు దృష్టి దోష పరిహారార్ధం కోసం తెర కట్టడం జరుగుతుంది. అందుకే దేవుడికి నైవేద్యం ప్రసాదించే టప్పుడు ఎన్నో దేవాలయాలలో పరదా కడుతూ ఉంటారు. అంతే కాదు అమ్మవారిని అలంకరించే టప్పుడు కూడా ఇలా పరదా కట్టడం హిందూ సాంప్రదాయంలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఈ విధానాలను ప్రతి దేవాలయాలు పాటిస్తారు. కాబట్టి మీరు కూడా గమనించవచ్చు.