Corona : కరోనా నుంచి కోలుకున్న తరువాత ఎంతో మందికి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఒక సర్వేలో తెలియజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతున్నాయట. వీటి వల్ల ప్రజలు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నట్లుగా వైద్యులు తెలియజేశారు. గడచిన ఐదు నుంచి ఆరు నెలలుగా ఈ వ్యాధులకు గురి అవుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక అంతే కాకుండా మనుషుల ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందట. కరోనా సమయంలో స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయట.
ఇక అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా మన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదట. దీని కారణంగా ఎముకలు కణజాలం దెబ్బతింటుంది. ఇక అంతే కాకుండా రక్తం సరిగా లేకపోవడంతో ఎముకలు పెళుసుగా మారతాయి. ఈ వ్యాధి ఎముకలను నాశనం చేయడమే కాకుండా.. దీనిని డెత్ ఆఫ్ బోన్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా తొడ తుంటి ఎముకలలో చాలా తీవ్రమైన నొప్పి.. నడిచేందుకు చాలా కష్టంగా ఉంటుంది. మోకాలి అంత్య భాగాలలో నొప్పి, కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటివి విటమిన్-డి లోపం వల్లనే వస్తూ ఉంటాయి.ఇక చిన్న పిల్లలలో అయితే ఇలాంటి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇందుకు గల ముఖ్య కారణం ఏమిటంటే లాక్ డౌన్ వల్ల పిల్లలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ఇక విటమిన్ డి లోపం ఏర్పడడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక అందుచేతనే పిల్లలు బలహీనత, శరీర నొప్పులు, నీరసంగా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయట. అయితే ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందాలి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకుంటే మంచిదని వైద్యులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండటం మంచిదట. ముఖ్యంగా క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.