Hair Tips : జుట్టుకు రాత్రిపూట మాత్రమే ఈ ప్యాక్ వాడితే లాభాలెన్నో..!!

Hair Tips : సాధారణంగా జుట్టు సమస్యలు తొలగిపోవాలి అంటే కొన్ని రకాల చిట్కాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం పగటి పూట జుట్టుకు సంబంధించిన కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే రాత్రిపూట మాత్రమే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల తప్పకుండా ఫలితం వుంటుంది. మీకు సమయం ఉన్నా లేకపోయినా రాత్రి పూట మాత్రమే హెయిర్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల తప్పకుండా ఫలితం లభిస్తుంది. అయితే ఇటీవల కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందికి సమయం దొరకడం లేదు. అందుకే ఇప్పుడు చాలా సింపుల్ చిట్కా మీ కోసం తీసుకురావడం జరిగింది.

ఇటీవల కాలంలో పురుషులు అలాగే మహిళలు ఇద్దరికీ కూడా జన్యువులు, హార్మోన్లు, ఆహారం, పర్యావరణ కారకాలు వంటి అనేక అంశాల కారణంగా జుట్టు సమస్యలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ కూడా జుట్టు సమస్య అధికం అవుతోంది. ఇక యువకులు కూడా తరచుగా జుట్టు రాలడం, జుట్టు పల్చబడటం, బట్టతల మరియు నెరిసిన జుట్టుతో బాధపడుతున్నారు. అందుకే ఇలాంటి వారికి చక్కని చిట్కా మీ కోసం..ఇక హెయిర్ ప్యాక్ కోసం ఎలాంటి పదార్ధాలు అవసరం అవుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఉల్లిపాయ రసం, తేనె మరియు లావెండర్ నూనె వంటి సహజ పదార్ధాలను ఉపయోగించి మీ జుట్టుకు హెయిర్ ప్యాక్ వేయండి.తయారీ కోసం..

Use this pack for hair only at night 
Use this pack for hair only at night

ఉల్లిపాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మిక్సర్ లో వేసి మెత్తటి పేస్ట్ లా చేయాలి.. ఇక రసం తీసిన తర్వాత అందులో తేనె మరియు లావెండర్ జోడించండి. అన్ని పదార్థాలను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మరియు స్కాల్ప్ అంతటా అప్లై చేసి..దానిని కవర్ చేయడానికి షవర్ క్యాప్ ను ఉపయోగించండి.. ఇక రాత్రిపూట అలా ఉండనివ్వండి. ఉదయం, మీ జుట్టును తేలికపాటి షాంపూ మరియు కండీషనర్‌తో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వలన చుండ్రు తొలగి పోవడమే కాదు జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి అంతే కాదు స్కాల్ఫ్ మీద రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.