Gadapa : గడపకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసా..?

Gadapa : హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి ఒక గడప అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ గడపను లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున గడపకు కుంకుమ , పసుపు, బియ్యం పిండితో ప్రత్యేకంగా అలంకరిస్తారు. మరి కొంతమంది ప్రతిరోజు గడపను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమలతో అలంకరించి పువ్వులను సమర్పించి బియ్యపుపిండితో ముగ్గు వేస్తారు. ఇక ఇలా చేయడం వల్ల ఆ ఇంటిలోని వారు ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఎల్లకాలం వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. ఇక గడపను పసుపుతో అలంకరించడానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇక శాస్త్రం మాత్రమే కాదు సైన్స్ కూడా ఏం చెబుతోంది అనే విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.

ఏ ఇంటి కైనా సిరి గడపలు తప్పనిసరి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారానికి గడపలే కాకుండా ఆ ఇంటిలోనే ఏ గదికైనా గడపలు లేకుండా ఆ ఇల్లు ఉండదు. గడపలేని గృహం కడుపు లేని దేహం లాంటిది అని పెద్దలు చెబుతూ ఉంటారు.. ఇక అందుకే ప్రతి ఒక్క ఇంటికి గడప అనేది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలంకరణలో భాగంగా గడప చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా ఇంటి సింహద్వారానికి మాత్రం తప్పకుండా గడప నిర్మించుకోవాలి.

Do you know why Gadapa is so important
Do you know why Gadapa is so important

ఇక ఆ గడపను శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ ఇంటిలోకి ఎటువంటి క్రిమికీటకాలు దరిచేరవు. పసుపుతో గడపను అలంకరించినప్పుడే పసుపులో ఉండే యాంటీబయటిక్ గుణం.. వీధుల గుండా పరిసరాల నుంచి వచ్చే ఎన్నో కోట్ల బ్యాక్టీరియాలు మన చెప్పులకు, కాళ్లకు అంటించుకుని గృహంలోకి ప్రవేశిస్తూ ఉంటాము. ఇక ఉదయాన్నే పసుపు నీళ్లతో గడపను శుభ్రం చేసి అంతకన్నా ముందు చక్కని ఆవుపేడతో కల్లాపి చల్లి నట్లయితే వాకిట్లోకి మనం అడుగుపెట్టగానే మన కాళ్లకు అంటుకున్న బ్యాక్టీరియా పసుపులో ఉండే యాంటీబయోటిక్ తో పోరాడి నాశనమవుతుంది. మనకు తెలియకుండానే మన కాళ్ళు శుద్ధి చేయబడతాయి. ఇక బియ్యం పిండి వల్ల బయట ఉండే చీమలు, క్రిమికీటకాలు లోపలికి ప్రవేశించలేవు.