Silent Killer : సైలెంట్ కిల్లర్ అని ఏ వ్యాధులను పిలుస్తారో తెలుసా..?

Silent Killer : ఈ మధ్య కాలంలో చాలా మంది తమ జీవన శైలిలో మార్పులకు చోటు ఇస్తున్నారు. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం లో జాగ్రత్త వహించాలి. అంతేకాదు జీవనశైలి ,చుట్టుపక్కల పరిసరాలు కూడా మన ఆరోగ్యం పై ప్రభావితం చూపుతాయి. అయితే వ్యాధి కారకాలు ఎప్పుడు ఎలా మన శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు.. శరీరం లోకి వచ్చి నెమ్మదిగా శరీర అవయవాలను పని చేయకుండా చేసి.. చివరికి కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను కూడా తీసేంత ప్రాణాంతకంగా మారిపోతాయి. అందుకే ఈ వ్యాధులను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటూ ఉంటారు. అంతే కాదు ఏ విషయంలోనైనా సరే ఈ వ్యాధులు అకస్మాత్తుగా దాడి చేసి ప్రాణాలు తీస్తాయి అని ప్రజలు భయపడుతుంటారు.ఇక అందరికీ అవగాహన కలిగించే ఈ ఆర్టికల్ వాట్స్ అప్ ద్వారా అందరికీ షేర్ చేయండి.

డయాబెటిస్ : డయాబెటిస్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ వచ్చిన తరువాత అలసట, బరువు కోల్పోవడం లేదా బరువు పెరగడం తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ ముదిరిన తర్వాత గుండె సంబంధిత వ్యాధులు , కంటి చూపు కోల్పోవడం, మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది.ఇక నెమ్మదిగా అవయవాల పనితీరు దెబ్బతిని ప్రాణం కోల్పోతారు.

Do you know what diseases are called Silent Killer
Do you know what diseases are called Silent Killer

2.కరోనరీ ఆర్టరీ డిసీజ్ : మనకు వచ్చే అత్యంత ప్రాణాపాయ గుండె జబ్బుల్లో ఇదీ ఒకటి. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్ ను సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది . ఫలితంగా ఛాతీనొప్పి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్య వచ్చిన తరువాత మనలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఎంత చికిత్స పొందినప్పటికీ మనిషి ప్రాణాలకు ఎవరూ గ్యారెంటీ అయితే ఇవ్వలేదు. ఈ సమస్య కూడా ముదిరిన తరువాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

3.అధిక రక్తపోటు : హైబీపీ ఎంతో మందికి వచ్చే సమస్యే కానీ..ప్రాణాలు తీయగల ప్రమాదకారి. దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితులలో ఇదీ కూడా ఒకటి. పరిస్థితి ముదిరాకే లక్షణాలు కనిపిస్తాయి. కబడ్డీ ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలి.

4.ఆస్టియోపొరోసిస్ : ఆస్టియోపొరోసిస్ ను బోలు ఎముకల వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చినప్పటికీ మనకు లక్షణాలు త్వరగా బయటపడవు కానీ ఎముకల సాంద్రతపై దీని ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఎముకలు గుల్లగా మారిపోతాయి. నడవలేని .. ఏ పని చేయలేని పరిస్థితికి దిగజారిపోయి క్రమంగా ప్రాణాలు కోల్పోతారు..