Hanuman Jayanti : కోరికలు తీరాలంటే హనుమాన్ జయంతి రోజు ఈ పూజ చేయాల్సిందే ..!!

Hanuman Jayanti : ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుగు క్యాలెండర్ లో ఏప్రిల్ 16వ తేదీ అనగా శనివారం రోజున చైత్ర పూర్ణిమ రాబోతుంది.ఆ రోజున హనుమాన్ జయంతినీ ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హనుమంతుడిని పవన పుత్రుడు, ఆంజనేయుడు అని కూడా పిలుస్తుంటారు. హనుమంతుడికి తన పుట్టిన రోజునాడు ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు.హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ రాశి వారు.. వారి రాశి చక్రం ప్రకారం హనుమంతుడికి ఎలాంటి ప్రసాదం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

If you want to fulfill your desires you have to perform this puja on Hanuman Jayanti day
If you want to fulfill your desires you have to perform this puja on Hanuman Jayanti day

1.మేషరాశి వారు శెనగపిండితో తయారుచేసిన లడ్డూలను హనుమంతుడికి ప్రసాదంగా సమర్పించాలి.
2.వృషభ రాశి వారు హనుమాన్ జయంతి రోజున తులసి విత్తనాలను స్వామి వారి పూజలు సమర్థించడం మంచిది.
3.మిధున రాశి వారు హనుమంతుడికి పూజలు చేసేటప్పుడు తులసి ఆకులను స్వామివారికి సమర్పించాలి.
4.కర్కాటక రాశి వారు ఆవు నెయ్యితో చేసిన శెనగ పిండిని నైవేద్యంగా సమర్పించాలి.
5.సింహ రాశి వారు హనుమంతుడికి జిలేబి సమర్పిస్తే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
6.కన్య రాశి వారు దేవునికి వెండి రేకు తో ఉన్న స్వీట్లను సమర్పించాలి.
7.తులా రాశి మోతిచూర్ లడ్డూ లను హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించాలి.
8.వృశ్చిక రాశి వారు ఆవునెయ్యి తో తయారు చేసిన శనగపిండి లడ్డును స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి.
9.ధనస్సు రాశి వారు హనుమాన్ జయంతి రోజు లడ్డూలను తులసి ఆకులను నైవేద్యంగా సమర్పించాలి.
10.మకర రాశి వారు కూడా మోతిచూర్ లడ్డూ లను స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి
11.కుంభ రాశి వారు ఎర్రటి వస్త్రం లడ్డూలను సమర్పించాలి.
12.మీన రాశి వారు హనుమాన్ జయంతి రోజున లవంగాలను సమర్పించాలి.