Health Benefits : వీటిని ఉడకబెట్టి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Health Benefits : మన పూర్వం నుంచి ఉడకబెట్టిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అలాంటివాటిలో శనగలు కూడా ఒకటి. మీరు శనగలు ఉడకబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వాటిపై ఉండే పొట్టును తీయకుండా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక అంతే కాకుండా వీటిని మొలకల రూపంలో కూడా తిన్నా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని వారంలో కనీసం రెండు సార్లు అయినా తినాలి.

ఈ శనగలలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. నాన్ వెజ్ అంటే తినలేని వారికి ఈ శెనగలు చాలా ఔషధంగా పనిచేస్తాయి. నాన్ వెజ్ లో ఉండే ఎన్నో పోషకాలు శెనగల లో ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ తినని వారు ఇవి తింటే చాలా మంచిది. ఇందులో ఎక్కువగా ప్రొటీన్లు , ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి బరువు తగ్గించుకోవడానికి ఎంతో సహాయ పడతాయి. ఈ శెనగలు తినడం వల్ల ఎక్కువగా ఆకలి వేసేవారికి వేయదు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

Do you know the benefits of eating these boiled
Do you know the benefits of eating these boiled

బరువు తగ్గాలనుకునేవారు దీన్ని డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీనిని పరిశోధనల పరంగా తెలియజేయడం జరిగింది. వీటిని స్నాక్స్ గా కూడా తినవచ్చు. శనగలలో ఆల్ఫా లినోలెనిక్, మేగా-3 ఫ్యాటి, ఉండడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇక అంతే కాకుండా ఇందులో సెరోటోనిన్ , ఎమినో యాసిడ్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల మంచి నిద్రను అందిస్తాయి. ఇక అందుచేతనే నిద్ర లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉంటారో .. అలాంటి వారు వీటిని కొద్దిరోజులపాటు తినడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా పాలతో సమానంగా ఉండే టువంటి పోషకాలలో శెనగలు ఉంటాయి. అందుచేతనే మీ యొక్క ఆహారంలో ఈ శనగల ని చేర్చుకోవడం మంచిది.