Astri Tips : సుఖసంతోషాలు కలగాలి అంటే వేసవిలో వీటిని దానం చేయాలి..!!

Astri Tips : సనాతన ధర్మంలో దాతృత్వానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని.. దానం చేయడం వల్ల పుణ్యం , పరమార్ధం లభిస్తుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం.. జీవితంలో సంతోషంగా ఉండడానికి దానం చాలా బాగా సహాయపడుతుంది. సనాతన ధర్మంలో ఏం వివరించబడింది అంటే ఒక నిర్దిష్ట సమయంలో పండుగ లేదా ప్రత్యేకమైన రోజులలో దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు ప్రజలు దానం చేయడానికి సరైన అవకాశం , సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక జ్యోతిషశాస్త్రంలో దాతృత్వం కోసం కొన్ని నియమాలను కూడా సూచించడం జరిగింది. వీటిని అనుసరించడం వల్ల ఫలితం అనేక రెట్లు పెరుగుతుందట.

జీవితంలో కష్టాలను తొలగించుకోవడానికి, కోరికలను నెరవేర్చుకోవడానికి, దానధర్మాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సి ఉంటుంది. దానం చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలియాలి కాబట్టి, ఈ ఆర్టికల్ ను వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి. దానం చేయడం అనేది గ్రహాలకు సంబంధించిన దోషాలను తొలగించడమే కాకుండా పాపం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఇక మనం దానధర్మాలు చేయడం వల్ల భూ లోకం లో సుఖం, పరలోకంలో మోక్షం కలుగుతుందట. ఇక మన శక్తి, సామర్థ్యానికి తగ్గట్టుగా దానం చేయాలని గ్రంథాలలో కూడా చెప్పబడింది. ఇక మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో కొన్ని పదార్థాలను దానం చేయడం వల్ల సుఖసంతోషాలు కలవడమే కాదు జీవితంలో కష్టాలు కూడా తొలగిపోతాయి.

To be happy means to donate these in the summer
To be happy means to donate these in the summer

నీరు : ఈ వేసవి కాలంలో దాహం వేసిన వారికి నీటిని దానం చేయడం గొప్ప పుణ్యం. వేసవిలో ప్రజలు తరచుగా దాహం తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఎవరైనా దాహార్తి లకు నీటిని దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇక మీకు ఒకవేళ వేసవిలో నీటి చలువ కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లయితే.. ముందుగా రెండు కుండలు నింపి వాటిని పక్కన పెట్టండి.. ఒక కుండ ను విష్ణుమూర్తికి మరొకటి మీ పూర్వీకులకు అంకితం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలు తీరిపోతాయి.

బెల్లం : పురాణాల ప్రకారం పూజ సమయంలో బెల్లం వాడడం వల్ల శుభప్రదమని గ్రంథాలలో చెప్పబడింది. అదే సమయంలో దానం చేయడం వల్ల జీవితానికి ప్రయోజనం కూడా చేకూరుతుంది. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జాతకంలో సూర్యుని స్థానం బలపడి కెరియర్లో ఏర్పడే సమస్యలు కూడా తొలగిపోతాయి.

మామిడి పండ్లు : అలాగే మామిడి పండ్లను దానం చేయడం వల్ల జాతకంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఏదైనా వృత్తి వ్యాపారంలో విజయం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది.