Buttermilk : వేసవి కాలంలో మజ్జిగ తాగితే కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసా..?

Buttermilk : ఎండాకాలంలో శరీరాన్ని ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. లేకపోతే సూర్యుడి తాపానికి మన శరీరంలో ఉండే నీటి శాతం కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే కొన్ని రకాల పానీయాలు సేవించాలి. వేడి తాపాన్ని తగ్గించుకోవాలంటే మజ్జిగ వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని వైద్యులు సైతం సిఫార్సు చేస్తున్నారు. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి శక్తి తో పాటు చల్లదనం కూడా లభిస్తుంది. ముఖ్యంగా పెరుగు తిన్నా ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి.ఇకపోతే పెరుగు తో తయారు చేసి మజ్జిగ తాగడం

వల్ల ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి .. మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి12, రైబో ఫ్లేవిన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. మజ్జిగ అధికంగా తాగడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. మరి మజ్జిగ తాగడం వల్ల లాభ నష్టాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటంటే.. మజ్జిగ కడుపు కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి , జీర్ణ వ్యవస్థ మెరుగు పడటానికి మజ్జిగ చాలా బాగా సహాయపడుతుంది.

Do you know the benefit buttermilk during the summer
Do you know the benefit buttermilk during the summer

ఇక అజీర్తి , అసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరానికి మంచి చల్లదనాన్నిచ్చే ఏదైనా ఉంది అంటే అది కేవలం మజ్జిగ మాత్రమే. అంతేకాదు శక్తి లభించి బలహీనత అనే భావన కూడా. మజ్జిగలో క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇక మజ్జిగలో బయో యాక్టివ్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. రక్తపోటు అదుపులో ఉంటుంది.