Padarasa ShivaLingam : పాదరస శివలింగం ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

Padarasa ShivaLingam : పురాతన శాస్త్రాల నుంచి వస్తున్న సాంప్రదాయం ఏమిటంటే పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడం.. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆ పరమశివునికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా సరే ఆ మహా శివుడు విగ్రహరూపంలో కాకుండా లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక లింగం అనేది సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్టించబడి ఉంటుంది. నిజానికి పురాణాల ప్రకారం మహాశివుడు మొదట విగ్రహ రూపంలోనే భక్తులకు దర్శనం ఇచ్చేవారు కానీ భ్రుగు మహర్షి శాపం వల్ల ఆయన లింగరూపంలో దర్శనం కల్పిస్తారు.

ఈ క్రమంలోనే ఎంతో మంది తమ ఇళ్లలో పాలరాతితో తయారుచేసిన శివలింగాన్ని అలాగే ఇత్తడి, రాయి, వజ్రం, బంగారం, మట్టితో చేసిన శివ లింగాలకు పూజలు నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా పాదరసంతో తయారు చేసిన శివలింగం ఉంటుందని అంతేకాదు ఆ శివలింగం ఎన్నో ప్రత్యేకతలను కూడా కలిగి ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. పాదరస శివలింగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అనే విషయం మనం చదివి తెలుసుకుందాం.నిజానికి పూర్వకాలంలోనే పాదరసంతో తయారు చేసిన దేవతా విగ్రహాలను అప్పట్లో ఇంట్లో పెట్టుకొని చాలా పవిత్రంగా పూజించే వాళ్ళు. పాదరస లింగాలు ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం

Do you know the uniqueness of Padarasa Shiva Lingam
Do you know the uniqueness of Padarasa Shiva Lingam

వల్ల ఎన్నో దోషాలు పోతాయని, పాపాల నుంచి విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. పాదరస శివలింగం ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు దూరం అవ్వడమే కాదు కోరిన కోరికలు కూడా ఆ పరమ శివుడు నెరవేరుస్తారు అట. ఇకపోతే పాదరస శివ లింగానికి అభిషేకం చేసిన నీటిని తాగించడం వల్ల రోగాల బారిన పడిన వారు కూడా వెంటనే కోలుకుంటారు. ఇంట్లో పెళ్లి ఈడు వచ్చిన వారికి ఎన్ని వివాహ ప్రయత్నాలు చేస్తున్న విఫలం అవుతూ ఉంటే.. పాదరస శివలింగానికి 21 రోజులు శివలింగారాధన చేయడం వల్ల వివాహం నిశ్చయమవుతుంది అట. పితృ దోషాలు నుంచి విముక్తి పొందడానికి కూడా పాదరస శివలింగం బాగా సహాయపడుతుందని వేద పండితులు చెబుతున్నారు.