sweat : చెమట వాసనను దూరం చేయాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..?

sweat :సాధారణంగా మనలో చాలా మంది దుర్ఘందమైన చెమట వాసనతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మందిలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. కొంతమందికి వేసవి కాలం లోనే కాకుండా శీతాకాలం లో కూడా ఇలాంటి చెమట వాసన సమస్య అధికంగా ఉంటుంది . అలాంటప్పుడు నలుగురిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అండర్ ఆర్మ్స్ లో వచ్చే ఈ చెమట దుర్వాసన కారణంగా పక్క వారికి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. మరి కొంతమంది స్వెట్ పాడ్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటివల్ల చెమట వాసన కొంతవరకు తగ్గుతుంది అని చెప్పవచ్చు. అండర్ ఆర్మ్ లో చెమట ఎక్కువ వస్తుంది అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది.


ఇప్పుడు ఈ చెమట వాసన దూరం చేసుకోవాలి అంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. మీరు స్నానం చేసే వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానం చేస్తే చెమట వాసన కు చెక్ పెట్టవచ్చు. యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులను వాడుతూ ఉండాలి. ఉదాహరణకు మార్కెట్లో వేప , అలోవేరా , పుదీనా ఆకులతో తయారు చేసిన సబ్బులను అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల చెమట వాసన దూరం కావడంతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేసుకోవచ్చు.


మంచి వాసన వచ్చే పౌడర్ లు , మాయిశ్చరైజర్ వంటి వాడకం తగ్గించాలి. చెమట వాసన దూరం చేయడానికి గ్రీన్ టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. స్నానం చేసేటప్పుడు నీటిలో గ్రీన్టీ వేసుకొని స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా చెమట వాసన అనేది ఎక్కువగా వస్తుంది.. తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి సమస్యలను దూరం చేయవచ్చు . ముఖ్యంగా మసాలా ఎక్కువగా ఉండే వంటకాలు, ఆల్కహాల్, రెడ్ మీట్ వంటి వాటికి కొంచెం దూరంగా ఉండటం మంచిది.