Devotional News : చిన్న పిల్లలకు దిష్టి తీసేటప్పుడు ఎక్కువగా చేసే తప్పు ఇవే..!!

Devotional News : నరదృష్టి ఎక్కువగా మన భారతీయ పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం అని చెప్పవచ్చు.. ఇలా దిష్టి తగిలినప్పుడు దాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసివేస్తారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి దిష్టి తగిలినప్పుడు చాలామంది పలు రకాలుగా అన్నం, ఉప్పు, ఎండు మిరపకాయలు వంటివాటితో దిష్టి ని తీసేస్తూ ఉంటారు. ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు చిన్న పిల్లలు ఎక్కువగా మారం చేస్తూ ఏడుస్తూ ఉంటారు. దీంతో మన పెద్దలు పిల్లలకు ఏదో దిష్టి తగిలింది అని తీసేయమని చెబుతూ ఉంటారు. అయితే దిష్టి అనేది నిజం గానే ఉంటుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మానవుని శరీరం నుండి ఒక కాంతి అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది.. అయితే కొన్ని దేవతల ఫోటోలు వెనకాల చూసినప్పుడు కూడా ఇలాంటి మెరుపు వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే మానవుని శరీరం వెలుపల కూడా అలాగే ఉంటుందని మన పండితులు తెలియజేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఎవరైనా మన వాళ్ళని పదేపదే చూసినా..మన గురించి మాట్లాడినా.. శరీరాన్ని దాటి ఉన్నటువంటి ఆ కాంతి శరీరం నుంచి కాస్త బ్రేక్ అవుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు. అలాంటి సమయంలోనే మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయట.అటువంటి సమయంలోనే మన ఇంట్లోని పెద్దలు దిష్టి తీసి పక్కకు పారేస్తూ ఉంటారు.

When focusing on small children
When focusing on small children

ఇలా చేయడం వల్ల అలా బిగుసుకుపోయిన మన శరీరం చాలా తేలికగా అయినట్లుగా మనం భావిస్తూ ఉంటాము. దీనిని దిష్టి అని అంటారు. దిష్టి లో ఎన్నో రకాలు దిష్టి లు ఉన్నాయి. అందులో కొబ్బరికాయతో తిప్పడం, కర్పూరం, ఆవు పేడ, వెంట్రుకలు తదితర రకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఎక్కడి నుంచి అయినా ప్రయాణం చేసి వచ్చిన ఆరోగ్యం బాగా లేకపోయినా ఎర్ర నీళ్లు తో దిష్టి తీస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. అలా కొట్టినప్పుడు ఆ దిష్టి అంత కొబ్బరికాయకే వెళ్లి పోతుందట. అయితే అలా కొట్టిన కాయని ముట్టుకోకూడదు.. ఒకవేళ ముట్టుకున్నట్లయితే వారికి తగులుతుందని మన పూర్వీకులు తెలియజేశారు. అందుచేతనే దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయలు ఎవరు ముట్టుకోకుండా ఉండాలి.