Health Problems : దగ్గు, జలుబు, జ్వరం దూరం కావాలంటే..?

Health Problems : చాలామందికి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తమ శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. శీతాకాలం వచ్చింది అంటే జలుబు, దగ్గు, జ్వరం రావడం సహజం. మరికొంతమందికి పగలు వేడిగాలులు.. రాత్రిపూట చలిగాలులు కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాదు వీటి వల్ల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు కు మనం ప్రతిసారి వైద్యుడి దగ్గరకు వెళ్లవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాటికి సంబంధించిన చికిత్సలను మనం ఇంట్లోనే చేసుకుంటే సహజసిద్ధంగా వీటిని మనం దూరం చేసుకోవచ్చు.

జలుబు , దగ్గు , జ్వరం వచ్చినప్పుడు ఔషధగుణాలతో సమృద్ధిగా నిండిన అల్లం టీని తయారుచేసుకొని తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఉదయం అలాగే సాయంత్రం పూట అల్లంతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక అంతే కాదు గొంతు నొప్పి అధికంగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి దూరం అవుతుంది. ఉప్పులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. రెండు లేదా మూడు సార్లు ఈ చిట్కా పాటిస్తే గొంతు నొప్పి దూరం అవుతుంది.

Health Problems If you want to get rid of cough, cold and fever
Health Problems If you want to get rid of cough, cold and fever

ఇక చాలామందికి జలుబు లేదా దగ్గు వచ్చినప్పుడు మన పెద్ద వాళ్ళు పాలలో పసుపు వేసి ఇస్తూ ఉంటారు. అవసరమైతే కొద్దిగా చక్కెర కూడా కలుపుకోవచ్చు. గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు , దగ్గు కూడా త్వరగా తగ్గుతాయి. పాలు అలాగే పసుపులో యాంటీబయటిక్ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా ఈ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు మీరు తులసిని ప్రతిరోజు ఉదయం పూట పరగడుపున జ్యూస్ చేసుకొని తాగినా మంచి ఫలితాలు లభిస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం, తేనె తో కూడా జలుబు సమస్యలను దూరం చేసుకోవచ్చు.