Hair Tips : చుండ్రు అధికంగా బాధిస్తోందా.. తగ్గించడం ఎలా అంటే..?

Hair Tips : అధిక పని , ఒత్తిడి , వాతావరణంలో కాలుష్యం, తీసుకునే ఆహారంలో పోషకాల లోపం, వయసు మీద పడటం , హెయిర్ డ్రయర్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం ఇలాంటి కారణాల వల్ల చుండ్రు సమస్య అధికమవుతుంది . ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. ఇక తరచూ జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని ప్రతి ఒక్కరు బాధ పడుతున్నారు. ఇక వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే తలపై చుండ్రు ఏర్పడుతుంది. కేవలం తల పైన మాత్రమే కాదు భుజాల పైన , కనుబొమ్మల పైన కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది. అయితే చుండ్రును చెక్ పెట్టడానికి అంతర్జాలంలో ఎన్నో రకాల పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్యను దూరం చేసుకోవచ్చు. ముందుగా అరకప్పు మునక్కాయ ఆకులను తీసుకొని మెత్తటి పేస్టులాగా చేయాలి. ఇక అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు మర్దన చేసి అరగంట తర్వాత చల్లని నీటితో తలను శుభ్రం చేయాలి. ఇక నెలకు రెండు లేదా మూడు సార్లు ఇలాంటి చిట్కా మీరు క్రమం తప్పకుండా పాటించినట్లైతే చుండ్రు పోవడమే కాదు జుట్టు రాలడం సమస్య కూడా తగ్గిపోతుంది.కుంకుడు కాయలు , శీకాకాయ జుట్టుకి చక్కటి క్లెన్సర్ అని చెప్పవచ్చు .

Dandruff problem Hair Tips in Mandara puvvu
Dandruff problem Hair Tips in Mandara puvvu

ఎందుకంటే స్కాల్ఫ్ ను శుభ్రం చేయడంలో ఈ రెండు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముందుగా ఒక గుప్పెడు మందార పువ్వులు తీసుకొని ..కుంకుడుకాయ , శీకాకాయ వేడినీళ్లలో వేసి బాగా మరణించేటప్పుడు మందార పువ్వులు కూడా వేయాలి. ఇక బాగా కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి వడగట్టి స్నానం చేసేటప్పుడు తలపై అప్లై చేసి ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా మారడమే కాకుండా చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి.