నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు.. తలలో పూలు ఎందుకు పెట్టుకోకూడదో తెలుసా..?

సంవత్సరానికి ఒకసారి పెట్టే నిల్వ పచ్చళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రా వారి ప్రియమైన ఆహారం ఆవకాయని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక ఆంధ్ర వారు పెట్టే పచ్చళ్లు దేశ విదేశాల వారు కూడా ఫిదా అవుతారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆంధ్ర ఆవకాయ ని తలచుకోగానే చాలు నోట్లో నీరు ఊరుతోంది. అసలే ఎండాకాలం పచ్చళ్ళు నిలువ చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అందుకే ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటా కూడా మామిడి పచ్చడి తయారు చేయడం మొదలుపెడతారు. మామిడి పచ్చడి మాత్రమే కాదు ఇతర రకాల పచ్చళ్లు కూడా పెడుతూ ఉంటారు.

ఈ పచ్చడి పెట్టడం లో కొంతమంది సఫలం అయితే మరికొంతమంది ఉప్పో .. కారమో లేదా ఇంకేదైనా ఆహార పదార్థము తగ్గిందంటూ పచ్చడి సంగతి మరచి పోతుంటారు. ఇకపోతే పచ్చడి చేసే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా పచ్చడి పెట్టిన ఒక వారానికే బూజు పట్టడం లాంటివి జరుగుతుంది . ఇక పోతే దానికి ప్రధాన కారణం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం.. ఉష్ణోగ్రత తగ్గి పోవడం లాంటి కారణాల వల్ల బూజు ఏర్పడుతుంది. ఇకపోతే శిలీంద్ర జాతికి చెందిన ఒక జీవి కారణంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు నిల్వ పచ్చళ్లు బూజు పడుతూ ఉంటాయి.ఇక ఉప్పు ఎక్కువ అయితేనే పచ్చడి త్వరగా బూజు పట్టదు అని పెద్దలు చెబుతూ ఉంటారు.

females do not even wear flowers on their heads when preparing pickles
females do not even wear flowers on their heads when preparing pickles

నిల్వ పచ్చడి చేసేటపుడు మామిడి ముక్కలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసి పచ్చడి పెట్టే జాడీలు కూడా బాగా శుభ్రంగా ఎండలో ఆరబెట్టాలి. అందులో ఎలాంటి సూక్ష్మక్రిములు లేకుండా చూసినప్పుడు నిల్వ పచ్చళ్ళు బూజు పట్టవు. ఇకపోతే ఆడవారు నిల్వ పచ్చడి చేసేటపుడు తలలో పూలు పెట్టుకోరు. ఇందుకు కారణం ఏమిటంటే పొరపాటున పచ్చడి లో పడితే తేమ శాతం ఎక్కువ అయిపోతుంది. అంతేకాదు వాటి వాసన వల్ల త్వరగా పచ్చడి చెడిపోతుంది . పైగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నిల్వ పచ్చడి పెట్టేటప్పుడు ఆడవారు పూలు పెట్టుకోరు.. అలాగే జాడీ నుంచి తీసేటప్పుడు కూడా పూలు పెట్టుకోరు.