Diabetes : డయాబెటిస్ వారు కాఫీ తాగవచ్చా..?

Diabetes : డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలన్నా సరే భయపడుతూ ఉంటారు. అందుకే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వీరు కొన్ని విషయాలు మర్చిపోవడం వల్ల చక్కెర స్థాయి అధికమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో తప్పకుండా ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. కాఫీ విషయానికి వస్తే మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ అనేది తప్పకుండా తాగుతారు. ఒకవేళ తాగకపోతే వారికి ఏ పని చేయాలన్నా కూడా కాస్త బద్దకంగా అనిపిస్తుంది. ఇక అందుకే చాలా మంది ఉదయం సమయంలో కాఫీ లేదా టీ ను ఎక్కువగా తాగుతారు ..కానీ ఇది మంచిది కాదని వైద్యులు చెప్పినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోరు.

ఉదయం తీసుకునే కాఫీ .. ఆ తర్వాత తీసుకొనే ఆహారం మీద ప్రభావం చూపి జీవక్రియ అలాగే చక్కెర స్థాయిలను దెబ్బతినేలా చేస్తోందట. ఎవరైనా సరే రాత్రి పడుకునే ముందు అలాగే ఉదయం లేచాక కూడా కాఫీ లేదా టీ తీసుకోకూడదు . ఎప్పుడైనా సరే అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే అది కూడా 9 నుంచి 10 గంటల సమయం లోపల మాత్రమే కాఫీ లేదా టీ తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారు కాఫీ తాగాలనుకుంటే ఉదయం అల్పాహారం చేసిన తర్వాత మాత్రమే తాగడం మంచిదని నిపుణులు తెలియజేశారు.

Can people with diabetes drink coffee
Can people with diabetes drink coffee

కాఫీలో ఉండే కెఫిన్ రక్తంలోని చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపుతుంది. అందుకే చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కాఫీ , టీ , పాలు వంటివి తక్కువగా తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఇకపోతే డయాబెటిస్ వారు ఆహారనియమాలను తప్పకుండా పాటించాలి. చక్కెర అధికంగా ఉండే పదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాలి. అంతే కాదు ఎప్పటికప్పుడు చక్కెర స్థాయిలను తెలుసుకుంటూ ఆరోగ్య నియమాలు పాటిస్తే భవిష్యత్తులో కూడా డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఆపవచ్చు.