అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు ఇలా చేస్తే అన్నీ మాయం..!!

మానవుని జీవితంలో ఎవరైనా సరే అవసరాన్ని బట్టి అప్పులు కచ్చితంగా చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంది అప్పులను తీర్చడానికి మరొక చోట కూడా అప్పులను చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ అప్పులు ఎక్కువయ్యి.. చివరికి ఏ అప్పు తీర్చాలో తెలియక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా అప్పిచ్చిన వాళ్లు .. ఎన్నో మాటలు అనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో అప్పులు తీరాలంటే ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది పండితులు తెలిపిన ప్రకారం ఈ విధంగా చేస్తే అప్పులు తొలగిపోతాయని తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

మనం ఎర్ర కంది పప్పును తీసుకుని ఒక రోజు నానబెట్టి.. మంగళవారం రోజున ఈ ఎర్ర కంది పప్పులను తీసుకొని గోశాలకు వెళ్లి అక్కడ ఉన్న వాటికి.. వీటిని పెట్టడం మంచిది. ముఖ్యంగా ఆవు ఎర్ర రంగులో ఉండే ఆవుకు పెట్టడం చాలా మంచిదట. ఈ విధంగా ఎర్ర కంది పప్పు నైవేద్యం గా పెట్టిన తర్వాత గోమాత చుట్టూ కేవలం తొమ్మిది ప్రదక్షిణలు చేసి.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దగ్గరికి వెళ్లి ఎవరైతే మీరు అప్పు ఇవ్వవలసి ఉంటుందో వారి దగ్గరకు వెళ్లి మీ దగ్గర ఉండే అంత డబ్బుని వారికి ఇవ్వాలి.. ఆ తరువాత సులువుగా అదే అప్పు తీరుతుందని పండితులు తెలియజేయడం జరిగింది.

If those who are suffering from debts do this then everything is eaten
If those who are suffering from debts do this then everything is eaten

ఇక మరొకటి ఏమిటంటే ఒక ఎర్ర బట్టలో పిండిని తీసుకొని దానిని దీపంలాగా చేసి అందులో ఆవాలు నూనె వేసి ఎర్రబట్ట తో ఒత్తి ని తయారు చేసి వెలిగించడం వల్ల అప్పుల బాధలు తీరుతాయని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. ఇది కూడా మంగళవారం రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పనిని ఉదయం లేవగానే 6 నుంచి 8 గంటల లోపు మాత్రమే చేయాలి. ఇలా చెయ్యడం మొదలు పెట్టాక.. దీపానికి దండం పెట్టుకొని ఆ తర్వాత భగవంతుడిని ప్రార్థిస్తే అప్పులు తీర్చే మార్గం అవే దొరుకుతాయట.