Weight Loss ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి.. చాలామంది అనుకుంటారు కానీ.. బెల్లీ ఫ్యాట్ ఎవరికోసం తగ్గించుకోవాలని అనుకుంటున్నారు.. సొసైటీ కోసమా లేదంటే మీ కోసమేనా.. హెల్దిగా ఉండాలి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని అనుకుంటున్నారా.. కచ్చితంగా మీ కోసమే కదా.. అలాంటప్పుడు ప్రతి రోజూ మీకోసం ఒక్క గంటను కేటాయించి వ్యాయామం, యోగ ఏదో ఒకటి చేసుకోవాలి..
అలాగే అనవసరమైన వాటిని తినడం తగ్గించాలి ఒకవేళ తిన్నా కూడా వారంలో ఐదు రోజులు కచ్చితంగా ఒక గంట చొప్పున రోజు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు చేస్తూనే ఉండాలి. మనం తినడం ఆపం కాబట్టి ఎక్ససైజులు చేయడం కూడా ఆపకూడదు. బాడీ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు గంటల తరబడి ఒకే చోట కూర్చుని అస్సలు ఉండకూడదు. కనీసం ప్రతి గంటకు ఒకసారి లేచి అటు ఇటు నడవాలి. టైం టు టైం తినేలాగా ప్లాన్ చేసుకోవాలి. చిన్నచిన్న వామప్స్ నుంచి యోగ స్టార్ట్ చేయడం మొదలుపెట్టి.. బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఎక్సర్సైజులు కూడా క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకోబోయే దాల్చిన చెక్క టీని ప్రతిరోజు ఉదయం తాగాలి.
ముందుగా దాల్చిన చెక్క పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకొని బాగా మరిగించి.. అందులో ఒక చెంచా దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీరు కాస్త గోరువెచ్చగా అయ్యాక అందులో నిమ్మ రసం కలుపుకోవాలి. ఈ దాల్చిన చెక్క టీ ని ఇలాగే తాగొచ్చు. లేదు అంటే చిన్న బెల్లం ముక్కను కలుపుకొని తాగితే ఇంకా రుచిగా ఉంటుంది. ప్రతిరోజు పరగడుపున ఈ టీ ని తాగి ఎక్సర్సైజులు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. బెల్లీ ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ , థైరాయిడ్ వంటి అనేక రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. అలాగే ఉదయం లేచిన వెంటనే టీ కాఫీలు అస్సలు తాగకూడదు. దీని వలన గ్యాస్ ఫార్మ్ అవుతుందని గుర్తుంచుకోండి..