Taraka Ratna : నందమూరి తారకరత్న ఇక లేరు.

Taraka Ratna : నందమూరి తారకరత్న సినీ ఎంట్రీ ఓ ప్రభంజనం.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడితేనే ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా రికార్డు క్రియేట్ చేశారు ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.. ఇక ఆయన రాజకీయ ఎంట్రీ కూడా మరో సెన్సేషన్ అని చెప్పాలి.. తారకరత్న యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోవడం.. అప్పటికి అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం జరిగాయి.. అయితే 23 రోజుల చికిత్స తర్వాత తారకరత్న ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు..

ఈ విషయం తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.. ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంతో తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఆయన అభిమానులు చేసిన పూజలు ఫలించలేదు. దేవుడు ఎవరి మొరను ఆలకించలేదు..

Taraka Ratna no more
Taraka Ratna no more

తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.. నందమూరి తారకరత్న 95శాతం ట్రీట్మెంట్ కు రియాక్ట్ కావడం లేదని వైద్యులు తెలిపారు. ఆ తరువాత ఒక్కసారి మాత్రమే ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. ఇక ఈరోజు సాయంత్రం ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారని సోషల్ మీడియా జోరుగా ప్రచారం చేసింది.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని ఆ బులిటన్ లో సమాచారం. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్స కూడా చేస్తున్నారట.. 23 రోజులుగా నారాయణ హృదయాలయాలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తారకరత్న బాడీలో అన్ని పార్ట్స్ పనిచేస్తున్న కానీ బ్రెయిన్ డెడ్ అయి ఉండచ్చు అని.. మిగతా అన్ని అవయవాలు పనిచేస్తున్న కానీ బ్రెయిన్ మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు అనేది .. విదేశీ వైద్యుల నుంచి క్లారిటీ తీసుకొని మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారట. కానీ నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మాత్రం ఈరోజు చాలా క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పనున్నారని తెలుస్తోంది..