Taraka Ratna: తారకరత్న ఉన్న ఆసుపత్రిలో బాలయ్య ఎదురు అవ్వగానే పట్టుకుని ఏడ్చేసిన జూనియర్ ఎన్టీఆర్

Taraka Ratna: టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్రలో నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని చికిత్సలు అందిస్తున్న వైద్యులు తెలిపారు. నందమూరి తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.. ఆ విషయం తెలుసుకున్న నందమూరి, నారా కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు..

నందమూరి తారకరత్న ఆరోగ్య విషయంలో బాలకృష్ణ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు నారా కుటుంబ సభ్యులు అలేఖ్య రెడ్డి బంధువులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నారు.. మరోవైపు ఆయనకు మెరుగైన వైద్యం అందించడం కోసం విదేశాలకు డాక్టర్స్ ను పిలిపించి ట్రీట్ మెంట్ కూడా ఇస్తున్నారు. కానీ ఎవ్వరి పూజలు, ప్రయత్నాలు ఫలించలేదు..

Taraka ratna Health condition Jr NTR CRying on in front of Balakrishna
Taraka ratna Health condition Jr NTR CRying on in front of Balakrishna

నందమూరి తారక రత్న ఇక లేరన్న వార్త తెలియగానే అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకుని తన అన్నయ్య ను చూసి రాగానే.. బాలకృష్ణ ను గట్టిగా పట్టుకొని బోరున విలపించారు జూనియర్ ఎన్టీఆర్.. ఆయన ఆరోగ్య విషమంగా ఉందని తెలిసినా .. పూర్తి ఆరోగ్యంతో తన అన్నయ్య తిరిగి వస్తాడని అనుకున్నాడట.. కానీ ఇలా జరిగే సరికి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబాయి ని పట్టుకుని ఎమోషనల్ అయ్యిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 39 ఏళ్ళకే నందమూరి తారకరత్న ఈ లోకాలను విడిచి వెళ్లిపోవడం బాధాకరం.. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అంతా ప్రార్ధిస్తున్నారు.