Mahasena Rajesh : టీడీపీ లో చేరీ చేరగానే మహాసేన రాజేష్ కి భారీ బ్రేకింగ్ న్యూస్ !

Mahasena Rajesh : వైకాపా ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియా వేదికగా సునిశిత విమర్శలు చేసే మహాసేన రాజేష్ తెదేపాలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దళిత సామాజిక వర్గంతో నిర్వహించిన సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే మహాసేన రాజేష్ కి తెదేపా లోకి చేరగానే వైసీపీ ఝలక్ ఇచ్చారు.. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కేసు పెడతామని మహాసేన రాజేష్ కి ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందట..

తాజాగా మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి తను టిడిపిలో చేయడంతో తనపై కేసులు పెట్టాలని చూస్తున్నారని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాదు ఎలా కేసు పెడతారు అంటూ పలు సాక్షాధారాలను కూడా చూపించాడు మహాసేన రాజేష్.. ఉదయం టిడిపిలో చేరను సాయంత్రానికి కేసు పెట్టారు అంటూ చెప్పుకొచ్చారు. అందరికీ జై భీమ్.. నేను మహాసేన రాజేష్.. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది యోధులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..

అయితే నేను లైవ్ లోకి రావడానికి ఒక కారణం ఉంది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమలులో ఉండట. ఈరోజు ఉదయం మేము ఎనిమిది గంటలకి బయలుదేరి సామర్లకోట వెళ్ళాము. మా వెనుకమాల ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో కూడా మేము చూడలేదు కానీ మేము పార్టీ నినాదం ఎక్కడా చేయలేదు చాలా ప్రశాంతంగా మేము సామర్లకోట వెళ్ళాము. దానికి సంబంధించి అయినా అన్ని ఎవిడెన్స్ లు మా దగ్గర ఉన్నాయి డ్రోన్ షాట్ లో, డిజిటల్ మీడియాను ఉపయోగించి కొన్ని వీడియోలు తీసాము..

మా మీద ఎలా కేసులు పెడతారు సార్ ఇప్పుడు మేము 4:30 కి మా ఆఫీస్ లో ఉన్నాము. మా ఆఫీసుకు వచ్చినప్పుడు సిసి ఫొటోస్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా కేసులు పెడతారో పెట్టుకోండి అన్నారు. మా దగ్గర ఉన్న సాక్షదారులను మేము కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పారు. మేము మా తప్పులను తెలుసుకునే టిడిపి జనసేన వారికి క్షమాపణలు చెప్పాను. మేము అలా మాట్లాడడానికి కూడా జగనన్నే కారణం. మీరు ఏమైనా తిట్టాలి అని అనుకుంటే జగనన్ననే తిట్టండి అంటూ చెప్పారు.

ఇంటింటికి దూరి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి చెబుతామని మహాసేన రాజేష్ అన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు దళితులకు ఇచ్చారు. మేము అమాయకులమని, చిన్న పిల్లలమని చూసి చూడకుండా వదిలేయాలని.. కాకినాడ ఎస్పీ ని రిక్వెస్ట్ చేశారు మహాసేన రాజేష్..