Taraka Ratna : నందమూరి తారకరత్న యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోవడం.. అప్పటికి అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం.. ఒకరోజు తరువాత తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.. ఆ తరువాత ఒక్కసారి మాత్రమే ఆయన హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారని సమాచారం..తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని ఆ బులిటన్ లో సమాచారం. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక చికిత్స కూడా చేస్తున్నారట.. 23 రోజులుగా నారాయణ హృదయాలయాలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకొని హాస్పటల్ వద్దకు బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చేరుకున్నారట.. మరికొద్ది సేపట్లో తారకరత్న ఆరోగ్యం గురించి కీలక అప్డేట్ అయితే రానుంది..
తారకరత్న బాడీలో అన్ని పార్ట్స్ పనిచేస్తున్న కానీ బ్రెయిన్ డెడ్ అయి ఉండచ్చు అని.. మిగతా అన్ని అవయవాలు పనిచేస్తున్న కానీ బ్రెయిన్ మాత్రం ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు అనేది .. విదేశీ వైద్యుల నుంచి క్లారిటీ తీసుకొని మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారట. అయితే నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి మాత్రం ఈరోజు చాలా క్రిటికల్ గా ఉందని వైద్యులు చెప్పనున్నారని తెలుస్తోంది..
అనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఈ న్యూస్ లో నిజమైందో తెలియదు కానీ.. అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా ఈ విషయం ఇప్పటికే స్ప్రెడ్ అయింది. మరి కొద్ది సేపట్లో తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది.