Beauty Tips : మెరిసే చర్మానికి చక్కని చిట్కా..?

Beauty Tips : అమ్మాయి అంటేనే అందం.. ఇంకా అందం అంటేనే అమ్మాయి అనడంలో సందేహం లేదు. అలాంటి అమ్మాయి అందంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో పోషకాల లోపం, శరీరంలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్, వాతావరణంలో కాలుష్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాల వల్ల అందమైన అమ్మాయి తన అందాన్ని కూడా అందవిహీనంగా మార్చుకుంటుంది. ఇకపోతే అందాన్ని మరింత పెంచుకోవడం కోసం ఇటీవల సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. మరికొంతమంది ఖరీదైన ఉత్పత్తులను వాడుతూ అప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే మెరిసే చర్మం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

ముల్తానీ మిట్టి : మార్కెట్లో విరివిగా లభించే ముల్తానీ మిట్టి తో మీ చర్మాన్ని మరింత అందంగా మార్చుకోవచ్చు. అయితే మీది జిడ్డు చర్మం అయితే ముల్తానీ మిట్టి లో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆగిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండు సార్లు పాటించినట్లయితే చక్కటి ఫలితాలు పొందడమే కాకుండా చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు కూడా దూరమవుతాయి. ఇక పొడి చర్మం కలవారు రోజ్ వాటర్ కి బదులు పాలను కలిపితే మంచి ఎఫెక్ట్ ఉంటుంది.

Beauty Tips in Multani Mitti Aloe Vera
Beauty Tips in Multani Mitti Aloe Vera

కలబంద : చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసే కలబందను కనీసం వారంలో మూడు సార్లైనా ముఖానికి అప్లై చేయాలి. కలబంద గుజ్జును నేరుగా ముఖానికి అప్లై చేయకుండా అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేస్తే చర్మం మరింత అందంగా మారుతుంది.

కేవలం ఈ రెండింటి తో మీ చర్మాన్ని అందంగా మార్చుకోవడం ఎలా కాకుండా తెల్లగా కాంతివంతంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.