Leafy Vegetables Benefits : మహిళలు తప్పనిసరిగా తినవలసిన ఆకుకూరలు ఏమిటి అంటే..?

Leafy Vegetables Benefits : ఇటీవల కాలంలో మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే రోజురోజుకు పెరిగిపోతున్న అనారోగ్య సమస్యల కారణంగా వారు సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఆడవారిలో రక్త హీనత, నిద్రలేమి, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఇలా మరెన్నో సమస్యలతో బాధపడుతున్నారు. ఆడవారిలో పోషకాలు ఎక్కువగా పెరగాలి అంటే ఆకుకూరలు పుష్కలంగా తినాలి. ముఖ్యంగా ఆకుకూరలు, లవణాలు అధికమొత్తంలో లభిస్తాయి. అలాంటి వాటిలో గోంగూరను మహిళలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆకుకూరలు చెప్పవచ్చు.ఇకపోతే ఈ కూర అతి మూత్ర వ్యాధిని అరికడుతుంది.

ముఖ్యంగా స్త్రీలకు బహిష్టు రోజులలో కలిగే అతి రక్త స్రావాన్ని అరికట్టడానికి కూడా చాలా చక్కగా సహాయపడుతుంది. ఇక బలహీనత వల్ల వచ్చే గుండెదడ, రుతుక్రమాన్ని క్రమబద్ధం కల్పించడంలో సమస్యలు, గుండె నొప్పి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీర అభివృద్ధికి అవసరమైన వివిధ కణజాలాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గోంగూర తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం, శరీర పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పవచ్చు.గోంగూర ఆకులు , పూలు శరీరాన్ని చల్లబరిచడమే కాకుండా చర్మం మీద వచ్చే మంటను కూడా తగ్గిస్తాయి. ఇక పొటాషియం , మెగ్నీషియం, క్యాల్షియం యొక్క నిజమైన స్థాయిలను కూడా కలిగి ఉంటాయి.

Leafy Vegetables Benefits women must eat
Leafy Vegetables Benefits women must eat

ముఖ్యంగా జ్వరం లక్షణాల నుండి ఉపశమనం పొందడం చాలా ఉపయోగకరంగా సహాయపడుతుంది. ముఖ్యంగా బచ్చలి కూర వలె గోంగూర ఆకులలో కాల్షియం ఉండడం వలన అది కాల్షియం ఆక్సలేట్ ను ఏర్పాటు చేస్తుంది. ఇక లోపంతో బాధపడేవారికి తక్షణ ఉపశమనం కలుగుతుంది. కిడ్నీ లో రాళ్ళు కూడా కరిగిపోతాయి. గోంగూర ఫోలేట్ యొక్క అద్భుతమైన మూలమని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ బి, సి కూడా పుష్కలంగా లభిస్తుంది . ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి , విటమిన్ ఎ, కాల్షియం లభించడం వల్ల ఆడవారికి మంచి పోషకాహారం అని చెప్పవచ్చు.