Dhana Yoga : ఈ చిన్న మంత్రం తో ధనయోగం పడుతుందట..!!

Dhana Yoga : కొంతమంది ఏం చేసినా డబ్బు చేతికి రాదు.. ఇక మరికొంతమంది ఏం చేయకపోయినా సరే వారికి డబ్బు రాశులుగా వచ్చి పడుతుంది. ఇకపోతే మరికొంత మంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించినా.. డబ్బు ఉంటే మాత్రం సమస్యలు తీరిపోతాయని ఒక రకంగా చెప్పవచ్చు. ముఖ్యంగా డబ్బు లేకపోతే ఎన్నో సార్లు అప్పులు చేస్తే వాటికి వడ్డీలు చెల్లించడం కూడా చాలా కష్టం గా మారిపోయింది. ఇక అందుకే అప్పుల బాధ నుంచి బయట పడడానికి పండితులు ఒక మార్గం సూచించారు. ఇది చాలా తేలికైన పద్ధతి అని చెప్పవచ్చు.

ముఖ్యంగా అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు పండితులు. అయితే మనస్ఫూర్తిగా చేస్తేనే సమస్యలు తొలగిపోతాయి.పురాణాలు, ప్రాచీన గ్రంథాలు, ప్రతులలో ఆర్థిక సమస్యలకు ఒక పరిష్కారం చూపడం జరిగింది. అదే కుబేర ధన యంత్రం. మీకు ఎప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినా సరే ఈ కుబేర మంత్రాన్ని జపించమని పండితులు చెబుతున్నారు. కుబేరుడు అంటే సంపదకు దేవుడు కాబట్టి కుబేర స్వామి పై నమ్మకంతో మంత్రాన్ని జపిస్తే కచ్చితంగా ఆర్థిక సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి తీరిపోతాయి. ఇక మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా సమస్యలన్నీ తొలగిపోతాయి.

Taking Dhana Yoga with a small mantra
Taking Dhana Yoga with a small mantra

ఇక ఒకవైపు మంత్రాన్ని జపిస్తూ, మరొకవైపు కుబేరుడికి పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.ఇకపోతే కుబేర స్వామి మంత్రం చదివేటప్పుడు మనసు స్వామి పైనే ఉంచాలి . మరే ఇతర విషయాలపై మీ మనసు వెళ్ళకూడదు. డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కరెక్ట్ గా ఉండాలి. పోతే మంత్రాన్ని రోజులో ఎప్పుడైనా జరిపించవచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం , రాత్రి వేళ జపిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ధన త్రయోదశి , కాళీ పూజ, అక్షయతృతీయ రోజు మరింత ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇక ఆ చిన్న మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీమ్ విత్తేశ్వరాయ నమః. ఇక ఈ చిన్న మంత్రం చాలు మీరు ధనవంతులు అవ్వడానికి.