Saturday : ప్రతి వారం 7 రోజులు అన్నట్టు ప్రతిఒక్కరూ తమకు ఇష్టమైన రోజున తాము ఆరాధించే దేవుడిని కొలుస్తూ ఉంటారు. అయితే శనివారం రోజున మాత్రం ఎక్కువగా ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి , శనీశ్వరుడి కి పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక అంతే కాకుండా వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కూడా సమర్పించి వారి ఆశీస్సులను పొందాలని చూస్తాము. ఇదంతా ఇలా ఉండగా శనివారం రోజున ఇలాంటి వస్తువులను మనం తీసుకోకూడదట. ఒకవేళ శనివారం రోజున ఎలాంటి వస్తువులను కొన్నట్లు అయితే ఏం జరుగుతుంది.. ఏ వస్తువులు కొనకూడదు వాటి వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
1). మన శాస్త్రాల ప్రకారం శనివారం రోజున నల్లగా ఉండేటువంటి ఏ వస్తువులను కొనకూడదు. ఏదైనా నల్లటి వస్తువులను దానంగా ఇవ్వవచ్చు. ఇక నల్లని వస్తువులు కొన్నా సరే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయట.
2). శనివారం రోజున ముఖ్యంగా మనం దీపారాధన చేసేటప్పుడు… నువ్వుల నూనె తో చేస్తే చాలా మంచిదట. ఆ రోజున శని దేవుడు అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నల్లని నువ్వులను ఈరోజు కొనకూడదట.
3). ఇక ఇనుము వంటి వస్తువులలో కత్తులు, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులను శనివారం రోజున కొనుగోలు చేయకూడదు. అవి ఆరోజున తీసుకున్నట్లయితే ఎన్నో నష్ట పరిణామాలకు దారితీస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
4). ఇక తోలు తో తయారు చేసినటు వంటి వస్తువులకు సంబంధించి శనివారం రోజున ఎటువంటి వస్తువులను కొనకూడదు.అవి అపజయానికి దారి తీస్తాయి.
5). శనివారం దినమున సాల్ట్ తీసుకుంటే ఎక్కువగా అప్పులపాలు అవుతారట.
6). శనివారం రోజున ఏదైనా కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదు,. ఎందుకంటే ఇవి లోహంతో తయారయ్యి ఉంటాయి. అందుచేతనే ఇలాంటి వస్తువులను ఈ రోజున కొనరాదు. ముఖ్యంగా కొత్త బట్టలు కూడా కొనడం మంచిది కాదట.
7). గోర్లు కత్తిరించడం, గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టడం వంటివి శనివారం రోజున చేయరాదని మన పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు.