Beauty Tips : ముఖంపై చిన్న మొటిమ కూడా కాంతివిహీనంగా కనిపించేలా చేస్తుంది.. అంతేకాకుండా వాటి తాలూకు మచ్చలు మోముపై వికారంగా కనిపిస్తాయి.. మొటిమలు మచ్చలు పోవడానికి మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే సహజసిద్ధమైన నిమ్మ ఆకులను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..! నిమ్మ ఆకులను ఏవిధంగా ఉపయోగించాలంటే..!?
నిమ్మ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను ముద్దగా నూరి అందులో కొద్దిగా తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. ముఖం పై ఉన్న మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొడుతుంది. నిమ్మ ఆకులను పేస్ట్ లా తయారు చేసుకొని ముల్తానీ మట్టిలో కలిపి ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. నిమ్మ ఆకుల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మోము పై ఉన్న మొటిమలు, మచ్చలు, నలుపు తొలగిపోతుంది. నిమ్మ ఆకుల ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది.
మీరు స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసి స్నానం చేస్తే అలసటను తగ్గించి హాయిగా ఉండటంతో పాటు.. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. నిమ్మ ఆకులను నీటితో స్నానం చేయడం వల్ల శరీర దుర్గంధం పోయి చక్కటి వాసన వస్తుంది. ఈ ఆకులను నలిపి చర్మంపై రుద్దితే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేసుకొని కాసేపటి తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం పై ఉన్న ట్యన్ తొలగిపోయి మిలమిలా మెరిసిపోతోంది.