Belly Fat Control : పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయింది అంటే చాలు ఫలితంగా స్థూలకాయం సమస్య ఏర్పడుతుంది. ఇక మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎక్కడచూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అడుగుకు ఒకటి వెలుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రుచికరమైన ఈ ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేరుగా ఇంటికే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు వ్యాపారస్తులు. అయితే ఇలా బాగా ఫ్రైడ్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ టేస్టీ గా ఉండడం కోసం ఇందులో ఉపయోగించే అజినిమోటో వల్ల కూడా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల లోపు అల్పాహారం తీసుకోవడం .. మధ్యాహ్నం 2:00 లోపు భోజనం, ఆ తర్వాత రాత్రి 7 నుంచి 9 గంటల లోపు డిన్నర్ చేయడం లాంటివి అలవాటు చేసుకోవాలి. ఉదయం 11 గంటలకు జ్యూస్ లేదా ఏదైనా తాజా పండ్లు సాయంత్రం సమయంలో పోషకాలు కలిగిన స్నాక్స్ లాంటివి తీసుకోవడం తప్పనిసరి. ఇక ఈ సమయాలను మీరు గనుక బిజీ లైఫ్ స్టైల్లో తప్పించారు అంటే ఎఫెక్ట్ మన ఆరోగ్యంపై పడుతుంది అనే విషయాన్ని గమనించాలి. సమయం దాటిపోయిన తర్వాత భోజనం చేయడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి తోపాటు పొట్టచుట్టూ చెడు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
అంతే కాదు టీవీ , స్మార్ట్ ఫోన్ , పేపర్ లేదా ఇతర ఏ వస్తువులను అయినా వీక్షిస్తూ భోజనం చేయడం సరికాదు. ఇలా చేయడం వల్ల మనం ఎంత తింటున్నామో తెలియక ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు మౌనం వహిస్తూ తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతే కాదు ఒకేసారి మొత్తం కడుపునిండా తినకుండా రెండు గంటలకు ఒక సారి తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉండవు. ఫలితంగా తాజాగా ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనికి తోడు యోగ.. వాకింగ్.. వ్యాయామం వంటివి చేయడం వల్ల మరికొన్ని సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.