Beauty Tips : పాదాలకు అంటిన నలుపు పోవాలి అంటే..?

Beauty Tips : వేసవికాలం అంటే భయపడే వారికి సూర్యుడు మరింత భయపెట్టడానికి రోజురోజుకు ఎక్కువగా వేడిని ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు కూడా తారాస్థాయికి అందుకుంటున్నాయి. వేసవి కాలం కేవలం శరీరానికే కాదు చర్మానికి కూడా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి హానికరం అని చెప్పవచ్చు. ఈ సూర్యకాంతి వల్ల చర్మం పొడిబారడమే కాదు అలర్జీలు, గీతలు తోపాటు చర్మం నల్లగా మారిపోతుంది. అందుకే చర్మాన్ని డీ టాన్ చేయడం చాలా ముఖ్యం. ఇకపోతే కేవలం అందం అంటే ముఖం, చేతులు మాత్రమే కాదు కాళ్ళు కూడా అందంగా కనిపించిన అప్పుడే అందం మరింత రెట్టింపవుతుంది.

Beauty Tips in Lemon juice sugar
Beauty Tips in Lemon juice sugar

నిమ్మరసం – చక్కెర :చక్కెర పాదాల మెరుపును పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. చక్కెర తో తయారు చేసే ప్యాక్ వల్ల పాదాలు తెల్లగా మారి నిగనిగలాడుతూ కనిపిస్తాయి. చక్కెర మృత చర్మ కణాలను బయటకు పంపించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక నిమ్మకాయలో ఉండే ఆమ్ల స్వభావం చర్మంలోని మెలనిన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో నిమ్మకాయ రసం వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. ప్రభావిత ప్రాంతాలపై పాదాల మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్ చేసి . ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే నిగనిగలాడే మీ పాదాలు మరింత మెరిసిపోతాయి.

బంగాళ దుంపలు కూడా చర్మ రంగును పెంపొందిస్తాయి. బంగాళా దుంప లలో కాటేకోలేస్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ఇది చర్మం యొక్క రంగును పెంపొందిస్తుంది. అలాగే పాదాలపై ఉండే నల్లటి మచ్చలను దూరం చేయడంలో బంగాళదుంప సమర్థవంతంగా పనిచేస్తుంది. బంగాళాదుంప రసాన్ని తీసి నిమ్మరసంలో కలిపి పాదాల మీద అప్లై చేయడం వల్ల పాదాల పై ఏర్పడిన టాన్ కూడా తొలగిపోతుంది.