Janasena : స్ట్రాంగ్ ప్లానింగ్ తో జనాల్లోకి పవన్ కల్యాణ్ .. TARGET 2024 ఎన్ని సీట్లో తెలుసా !!

Janasena : ప్రజాక్షేత్రంలో జనసేన శ్రేణులు కదం తొక్కబోతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలే. వివిధ శ్లాబుల్లోని విద్యుత్ ఛార్జీలను పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజా పెంపువల్ల ప్రజలపై రు. 1400 కోట్లు భారం పడనుంది. ఇదే విషయాన్ని జనసేన  అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపులాంటి భారాన్ని జనాలపై మోపితే తమ పార్టీ అంగీకరిచదంటు స్పష్టంగా చెప్పేశారు.

 

ప్రభుత్వం పెంచిన ఛార్జీల భారం ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఒకేసారి యూనిట్ కు 40 పైసలు పెరిగిపోయింది. దీనివల్ల జనాల గూబగుయ్యమనటం ఖాయం. విద్యుత్ ఛార్జీలు ఎంత పెరుగుతాయనేది ఇప్పటికిప్పుడు స్పష్టంగా తెలియకపోయినా రేపు బిల్లు చేతిలోకి వచ్చినాక అందరికీ అర్ధమవుతుంది బాదుడి ఎఫెక్టు ఎంతుందో. ఇదే విషయాన్ని పవన్ ప్రస్తావిస్తు ప్రభుత్వం హేతుబద్దత లేకుండా ఛార్జీలు పెంచటం దుర్మార్గమన్నారు.

 

పవన్ వైఖరి చూస్తుంటే తొందరలోనే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే తన శ్రేణులను బాగా యాక్టివ్ చేస్తున్నారు. జిల్లాల్లోని నేతలు కూడా వివిధ సమస్యలను తీసుకుని ఆందోళనలు చేస్తున్నారు. అంటే నిత్యం జనసైనికులను జనాల్లోనే ఉండేట్లుగా పవన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయబోతున్నారు. ఇపుడు జరుగుతున్నదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. ట్రైలర్లోనే నేతలు, కార్యకర్తలు ఇంత యాక్టివ్ గా ఉంటే రియల్ సినిమా మొదలయ్యే సమయానికి ఇంకెత యాక్టివ్ అవుతారో చూడాలి.

ఈ నేపధ్యంలోనే విద్యుత్ ఛార్జీల పెంపు అంశం జనసేనకు బాగా అందివచ్చింది. పవన్ గనుక ఒకసారి రోడ్లమీదకు వస్తే నేతలు, జనసైనికులు కూడా తోడవుతారు. వీళ్ళకి జనాల మద్దతు తోడైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ గనుక రోడ్డెక్కితే కచ్చితంగా జనాలు కూడా మద్దతుగా నిలబడతారు. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ సమస్య కాబట్టి, ప్రతి ఇంటి సమస్య కాబట్టి. ముందు మధ్య తరగతి జనాల మనసుల్లో పవన్ స్ధానం సంపాదించుకుంటే చాలు మిగిలిన పనులు వాటంతటవే జరిగిపోతాయి.

2024 ఎన్నికల్లో కనీసం 50+ పైగా సీట్లు సాధించే ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాని ప్రకారమే ఆయన ప్లానింగ్ కనిపిస్తోంది. ఈస్ట్ వెస్ట్ తో పాటు గుంటూరు , కృష్ణా జిల్లాల్లో జనసేన పట్టు బలంగా ఉంది. ఉత్తరాంధ్ర లో మూడు పార్టీలకీ సమానంగా ఉన్నా .. గత ఎన్నికల్లో తక్కువ మార్జిన్ తో వైసీపీ గెలిచిన చోట ఈ సారి జనసేన కి స్పష్టమైన పాజిటివ్ పవనాలు వీస్తున్నాయి.