Health Benefits : సీతాఫలం ఆకుల గురించి మీకు ఈ నిజాలు తెలుసా..!?

Health Benefits : సీతాఫలం మధురమైన రుచిని కలిగి ఉంటుంది.. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండును ఇష్టంగా తింటారు.. పైగా ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి.. సీతాఫలం ఏ కాదు సీతాఫలం ఆరోగ్యానికి కూడా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి..!సీతాఫలం ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడపోసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

సీతాఫలం ఆకుల కషాయాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరస్, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.. సీతాఫలం ఆకుల కషాయం మధుమేహులకు వరంగా చెప్పవచ్చు. పరగడుపున ఈ ఆకుల కషాయాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల కషాయాన్ని తాగితే వృద్ధాప్య ఛాయలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది..

Amazing Health Benefits Of custard Apple Leaves
Amazing Health Benefits Of custard Apple Leaves

ఈ ఆకుల కషాయం తాగితే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండె పోటు రాకుండా చేస్తుంది. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని వాటిపై ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే త్వరగా మానిపోతాయి. గజ్జి, తామర, దురద ఉన్నచోట కూడా ఈ ఆకుల మిశ్రమాన్ని రాస్తే చర్మ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మీరు రాసుకునే ఫేస్ ప్యాక్ లలో ఈ ఆకుల పొడిని కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.