Beauty Benefits : తామర నూనెతో అందం, కేశ సౌందర్యం రెట్టింపు..!

Beauty Benefits : తామర పువ్వు చూడటానికి చాలా రమణీయంగా, అందంగా ఉంటుంది.. ఈ పువ్వును చూడగానే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.. తామర పువ్వు లో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. లోటస్ లో విటమిన్ బి, సి, ఫైబర్, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.. తామర నూనెతో అందాన్ని పెంపొందించుకోవచ్చు..!తామర నూనె చర్మానికి గొప్ప కండీషనర్..

కమలం నూనె చర్మాన్ని హైడ్రేట్ చేసి లోతుగా పోషణను అందిస్తుంది. ఈ నూనెలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు ఉన్నాయి. ఈ నూనెతో మర్ధనా చేసుకుంటే నిర్జీవంగా మారిన చర్మాన్ని పునరుత్తేజం చేస్తుంది.. చర్మాన్ని ఎక్స్ పోలియెట్ చేస్తుంది. ఈ నూనె చర్మ రంధ్రాలపై ఉన్న మృత కణాలను తొలగించి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలు పడకుండా చేస్తుంది. వృథాప్య ఛాయలను తొలగిస్తుంది.

Health and Beauty Benefits Of Lotus Oil
Health and Beauty Benefits Of Lotus Oil

తామర నూనె తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. ఇలా రాసుకోవడం వలన జుట్టు కుదుళ్ళకు పోషణ అందించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. తామర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తాయి. నొప్పులు ఉన్నచోట ఐదు నిమిషాల పాటు నూనె రాసుకొని మర్దనా చేసుకుంటే అన్ని రకాల శారీరక నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.